తమిళ నటుడు సిద్దార్థ్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమిళంలో అతను హీరోగా పరిచయం అయిన ‘బాయ్స్’ సిినిమా అక్కడి కంటే తెలుగులోనే బాగా ఆడింది. ఈ గుర్తింపుతోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో ఛాన్స్ పట్టేశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయి తన కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. ఇక ‘బొమ్మరిల్లు’ సాధించిన సక్సెస్, సిద్ధుకు వచ్చిన ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఈ దెబ్బతో తెలుగులో పెద్ద స్టార్ అయిపోతాడనుకున్నారు. కానీ విజయం సాధించడం కంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం అనే విషయం సిద్ధు విషయంలో రుజువైంది. తర్వాత పదేళ్లలో ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేక తెలుగులో పూర్తిగా ఫాలోయింగ్, మార్కెట్ కోల్పోయి సొంతగడ్డ కోలీవుడ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే ‘జిగర్ తండ’ లాంటి కొన్ని విజయాలు అందుకున్నాడు.
కానీ ఒక దశ దాటాక సిద్ధుకు తమిళంలో కూడా కలిసి రాలేదు. అదే సమయంలో ‘మహా సముద్రం’ చిత్రంతో తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అటు తమిళ:లో సరైన సినిమాలు పడక.. ఇటు తెలుగులో కెరీర్ మళ్లీ పుంజుకోక చాలా ఇబ్బంది పడ్డాడు సిద్ధు. ఈ స్థితిలో అతడి ఆశలన్నీ ‘టక్కర్’ మీదే నిలిచాయి. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజైంది. రెండు చోట్లా సినిమాకు ఓ మోస్తరు బజ్ కనిపించింది. ఈ చిత్రంతో సిద్ధు బలంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనుకున్నారు. రెండు చోట్లా సరైన పోటీ లేకపోవడంతో సినిమాకు మంచి రిలీజ్ దక్కింది.
ఇక్కడ అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్ లాంటి పెద్ద నిర్మాతలు సినిమాను బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రానికి దారుణమైన టాక్ వచ్చింది. సినిమా మినిమం ఇంప్రెస్ చేయలేకపోయింది. సిద్ధు అయితే సినిమాలో తీవ్రంగా నిరాశ పరిచాడు. లవ్ స్టోరీలు మొహం మొత్తినా సరే అవే సిద్ధుకు బెటర్ అన్న ఫీలింగ్ కలిగించింది ఈ చిత్రం. ‘టక్కర్’ చూశాక ఇలాంటి సినిమాలు తీయడం కన్నా.. సినిమాలు ఆపేయ్ అని సిద్ధును ఉద్దేశించి అంటున్నారు ఫ్యాన్స్. ఈ ఫలితంతో సిద్ధు మార్కెట్ జీరో అయిపోయేలా ఉంది. అతను కూడా సినిమాలు చేయడంపై పునరాలోచించే స్థాయిలో డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది ‘టక్కర్’.
This post was last modified on June 10, 2023 12:13 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…