ఇంకో వారం రోజుల్లోనే భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ బరిలో దిగబోతోంది ‘ఆదిపురుష్’ సినిమా. రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఈ సినిమాకు హైప్ పెరుగుతోంది. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్, కొత్త ట్రైలర్ సినిమా పట్ల పాజిటివిటీని ఇంకా పెంచాయి. బేసిగ్గా ప్రభాస్ అంటేనే నో నాన్సెన్స్, అందరికీ డార్లింగ్ అనే పేరుంది. వేరే స్టార్ హీరోల్లాగా అతడి పట్ల నెగెటివిటీ కనిపించదు.
సోషల్ మీడియాలో అతణ్ని టార్గెట్ చేసేవాళ్లు తక్కువ. వేరే హీరోలు కూడా అతడితో చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయా హీరోల అభిమానులు కూడా పట్ల తనపై సానుకూల భావనతో ఉంటారు. ‘ఆదిపురుష్’ విషయంలో ఈ పాజిటివిటీని ఇంకా పెంచే ప్రయత్నం జరుగుతోంది. ప్రభాస్ కోసం కొందరు హీరోలు ‘ఆదిపురుష్’ టికెట్లను పెద్ద ఎత్తున కొని పేద పిల్లలకు పంచే ప్రయత్నంలో ఉండటం విశేషం.
ఇప్పటికే ‘ఆదిపురుష్’ తెలుగు వెర్షన్ రిలీజ్‌లో భాగస్వామి అయిన నిర్మాత అభిషేక్ అగర్వాల్.. పది వేలకు పైగా ‘ఆదిపురుష్’ టికెట్లను స్కూల్ పిల్లలకు పంచడానికి సిద్ధమయ్యాడు. కాగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్, టాలీవుడ్ నుంచి రామ్ చరణ్.. ప్రభాస్ కోసం రంగంలోకి దిగుతుండటం విశేషం.
వీళ్లిద్దరూ పది వేల చొప్పున ‘ఆదిపురుష్’ టికెట్లు కొనబోతున్నారట. ఇరువురూ పేద, అనాథ పిల్లలకు ఆ టికెట్లను పంచబోతున్నారు. ఈ బాటలో మరి కొందరు హీరోలు నడిచినా ఆశ్చర్యం లేదు. దీని వల్ల ఆయా హీరోల అభిమానులు ‘ఆదిపురుష్’ను ఓన్ చేసుకుంటారు. మరోవైపు పిల్లలు అందరూ తప్పక చూడాల్సిన సినిమా అనే భావనా పెరుగుతుంది. ఇది చాలా మంచి ప్రమోషనల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఈ కోణంలో చూస్తే ప్రభాస్‌కు ఈ హీరోలు చేస్తున్న సాయం చాలా పెద్దదే.
This post was last modified on June 9, 2023 5:03 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…