వెండితెరపై ప్రేమకథలు రెగ్యులర్ గా చూస్తాం. క్లైమాక్స్ లో ప్రేమికులు ఒక్కటై పెళ్లి చేసుకోవడం చూసి ఆనందిస్తాం. కానీ తెరమీద నటించడంతో మొదలై నిజ జీవితంలో భార్యా భర్తలుగా మారిన టాలీవుడ్ జంటల ముచ్చట్లు ఆసక్తికరంగా ఉంటాయి. అవేంటో ఓసారి చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల గార్ల గురించి మొదటగా చెప్పుకోవాలి. జంటగా కనిపించడంతో మొదలుపెట్టి నిర్మాణం, దర్శకత్వం తదితర బాధ్యతల్లో పాలు పంచుకున్న తీరు అమోఘం. అక్కినేని నాగార్జున – అమల ఇప్పటికీ మోస్ట్ లవ్లీ కపులని అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా ఒప్పుకుంటారు
ఏ ముహూర్తంలో కలిసి నటించారో కానీ తొలిచూపులోనే ప్రేమలో పడిన శ్రీకాంత్ – ఊహ తమ బంధాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఆహుతిలో కలుసుకున్న రాజశేఖర్ – జీవిత దశాబ్దాల తరబడి ఒకరికి ఒకరుగా తోడుంటూ జీవనం సాగిస్తున్నారు. వంశీ సినిమా మహేష్ బాబు – నమ్రతలను ఒక్కటి చేసింది. వరుణ్ సందేశ్ – వితిక ఇద్దరికీ టాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకున్న ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని సౌత్ ప్రేక్షకులకు పరిచయమే. వరుడు విలన్ కం తమిళ హీరో ఆర్య – సాయేషాలది సేమ్ స్టోరీనే
బాలీవుడ్ లోనూ ఇలాంటి జంటలు బోలెడు. అమితాబ్-జయ బాధురి, ధర్మేంద్ర-హేమామాలిని, రణ్వీర్ సింగ్-దీపికా పదుకునే, రన్బీర్ కపూర్-అలియా భట్, సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ లు చెప్పుకుంటూ పోతే లిస్టు ఎక్కువగానే ఉంది. కన్నడలో అంబరీష్ -సుమలత, యష్-రాధికా పండిట్, తమిళంలో శరత్ కుమార్-రాధిక ఎందరో ఉన్నారు. తాజాగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు యాడయ్యారు. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్, సమంతా-నాగ చైతన్య జోడీలు విడాకుల దాకా వెళ్లాయి. ఏది ఏమైనా లవ్ స్టోరీస్ కేవలం స్క్రీన్ మీదే కాదు రియల్ లైఫ్ లోనూ గొప్పగా పండుతాయని చెప్పటానికి ఈ ఉదాహరణలు చాలేమో.
This post was last modified on June 8, 2023 6:20 pm
కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…
ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…