ఇప్పుడు పెద్ద హీరోల పుట్టిన రోజులు వచ్చాయంటే సోషల్ మీడియాలో హంగామా అంతా ఇంతా కాదు. మామూలుగానే సోషల్ మీడియా హడావుడి బాగా ఎక్కువైపోగా.. కరోనా కారణంగా బయట యాక్టివిటీస్ అన్నీ ఆగిపోవడంతో అక్కడ సందడి ఇంకా పెరిగిపోతోంది. తమ హీరోల బర్త్ డేలకు కొన్ని రోజుల ముందే కౌంట్ డౌన్ పెట్టి అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు.
హీరోల పీఆర్ టీమ్స్ కూడా సోషల్ మీడియా ట్రెండ్స్ మీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాయి. పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే కామన్ డిస్ ప్లే పిక్ డిజైన్ చేసి అఫీషియల్‌గా సెలబ్రెటీలతో రిలీజ్ చేయించడం.. అభిమానులు ఆ పిక్‌కే పుట్టిన రోజు వరకు డీపీగా పెట్టుకోవడం మామూలే.
ఐతే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు ఇంతకుమించి ఏదైనా చేయాలని ఆయన పీఆర్ టీం ఫిక్సయింది. ఇందుకోసం ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతోంది. ఇప్పటిదాకా కామన్ డిస్ ప్లే పిక్స్ రిలీజ్ చేయడం చూశాం. కానీ చిరు పుట్టిన రోజును పురస్కరించుకుని కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయబోతున్నారు.
చిరు పుట్టిన రోజుకు వారం ముందు.. అంటే ఆగస్టు 15న ఇది రిలీజవుతుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ సినీ పరిశ్రమల్లోని 65 మంది ఫిలిం సెలబ్రెటీలను లైన్లో పెడుతున్నారు. వారితో ఒకేసారి ఈ కామన్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయిస్తారు. ఆ తర్వాత వారం రోజుల కౌంట్ డౌన్‌లో మరిన్ని సోషల్ మీడియా ట్రెండ్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి మెగాస్టార్ పుట్టిన రోజుకు సోషల్ మీడియాలో సందడి ఓ రేంజిలో ఉండేలా ఉంది.
This post was last modified on August 10, 2020 6:41 am
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…
ఏపీలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కూటమి ఎంపీలు కీలక…