త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమా గాండీవధారి అర్జున విడుదల తేదీని లాక్ చేసుకుంది. ఆగస్ట్ 25న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అదే నెలలో ఆగస్ట్ 11న చిరంజీవి భోళా శంకర్ వస్తున్న సంగతి తెలిసిందే. అంటే పెదనాన్న అబ్బాయికి మధ్య గ్యాప్ కేవలం రెండు వారాలే ఉండబోతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇదేమి పెద్ద విషయం కాదు కానీ ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ థియేటర్లు లాక్ చేసుకునే విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉండాలి.
ఎందుకంటే భోళా శంకర్ తో పాటు రన్బీర్ కపూర్ యానిమల్, సన్నీడియోల్ గదర్ 2, రజినీకాంత్ జైలర్ లు వస్తున్నాయి. ఎంతలేదన్నా వీటికి రెండు నుంచి నాలుగు వారాలకు అగ్రిమెంట్లు జరుగుతాయి. దేనికైనా ఫ్లాప్ టాక్ వస్తే ఆటోమేటిక్ గా ఒప్పందాలు మారిపోతాయి కానీ హిట్ అయితే మాత్రం బయ్యర్లు అంత సులభంగా మార్చరు. సో గాండీవధారి అర్జునకి ఈ క్యాలికులేషన్లు కీలకంగా మారతాయి. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఫలితం మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు
ఈ మధ్య కుర్ర హీరోలు గూఢచారులుగా కనపడేందుకు ఉత్సాహం చూపిస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ ఏజెంట్ గా వచ్చాడు. ఈ 29న నిఖిల్ స్పైగా కనిపించబోతున్నాడు. అడవి శేష్ గూఢచారి 2తో రెడీ అవుతున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చింది. డిఫరెంట్ టైటిల్ అయితే పెట్టారు. అన్నట్టు పెళ్లి 9న అన్నారు కానీ మళ్ళీ దానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ మెగా ఫ్యామిలీ నుంచి లీక్ కాలేదు. గుట్టుగా చేసేసి ఫోటోలు బయటికి వదులుతారా లేక ఏదైనా వాయిదా పడిందా అనేది ఇంకో రెండు రోజుల్లో తేలనుంది. గని డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కో హిట్ చాలా అవసరం
This post was last modified on June 7, 2023 8:26 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…