‘అర్జున్ రెడ్డి’ అనే చిన్న సినిమాతో సందీప్ రెడ్డి వంగ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్దగా పేరు లేని హీరోతో ఓ కొత్త దర్శకుడు మొదలుపెట్టిన ఈ సినిమాను మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీజర్ రిలీజయ్యాక కథ మారిపోయింది. ఇక ఆ తర్వాత సినిమా సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందా చిత్రం. హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తే అక్కడా సెన్సేషనల్ హిట్టయింది. సందీప్ పేరు మార్మోగిపోయింది.
తన తొలి సినిమాతో అంతగా ట్రెండ్ సెట్ చేసిన సందీప్.. ఈ లాక్ డౌన్ కాలంలో సోషల్ మీడియాలో మరో ట్రెండుకు శ్రీకారం చుట్టాడు. నాలుగు రోజుల కిందట తాను ఇంటి పని చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిన అతను.. తన లాగే ఇంట్లో పని చేస్తున్న వీడియో పోస్ట్ చేయమని దర్శక ధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరాడు.
అలా మొదలైన ఈ ఛాలెంజ్.. నాలుగు రోజులు తిరిగేసరికి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ట్విట్టర్లో ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్లు, డైరెక్టర్లు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి తమ ఇంటి పని వీడియోలు షేర్ చేశారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి భలేగా విస్తరిస్తోందీ ఛాలెంజ్. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వీడియో అయితే అందరినీ అబ్బురపరుస్తోంది. ఇది చూసి ఉత్తరాది జనాలు కూడా స్పందిస్తున్నారు. త్వరలోనే ఈ ఛాలెంజ్ ఇతర ఫిలిం ఇండస్ట్రీలకు విస్తరించినా ఆశ్చర్యం లేదేమో.
మొత్తానికి సందీప్ రెడ్డి తన తొలి సినిమాతో ఎలా అయితే ట్రెండ్ సెట్ చేశాడో.. ఇప్పుడు లాక్ డౌన్ ఛాలెంజ్‌తోనూ అలాగే ఓ కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు. ఇదెంతో స్ఫూర్తిదాయకంగా ఉండటంతో నామినేట్ అయిన వాళ్లందరూ తప్పక పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకెవరినైనా సందీప్ ట్యాగ్ చేస్తే ఎలా ఉండేదో కానీ.. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్‌ను ఎంచుకోవడం, ఆయన స్పోర్టివ్‌గా తీసుకుని తన వీడియోను పెట్టడంతో ఈ ఛాలెంజ్ సూపర్ హిట్టయిపోయిందంతే.
This post was last modified on April 24, 2020 2:05 pm
హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…
పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…
ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…
ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…
త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ…