వచ్చే శుక్రవారం ‘విమానం’ అనే ఎమోషన్ డ్రామా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సముద్రఖని , అనసూయ , ధన్ రాజ్ , రాహుల్ రామకృష్ణ నటించిన ఈ సినిమా తండ్రి కొడుకుల ఎమోషన్ తో తెరకెక్కింది. శివ ప్రసాద్ యనమల దర్శకత్వంలో కిరణ్ కొర్రపాటి, జీ స్టూడియోస్ తో కలిసి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. టీజర్ , ట్రైలర్ లో కంటెంట్ క్లియర్ గా చెప్పేశారు. తన పంచ ప్రాణలుగా భావించే కొడుకు విమానం ఎక్కాలనే పెద్ద కోరికను చిన్న పని చేసే అవిటి తండ్రి ఎలా తీర్చాడు అనేది సినిమా కథ.
ట్రైలర్ చూస్తే ఎమోషనల్ డ్రామా అనిపిస్తుంది. అయితే ఇందులో ఎంటర్టైన్ మెంట్ అంటే అనసూయ పాత్రే కనిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ , అనసూయలతో వచ్చే ట్రాక్ ఎట్రాక్టీవ్ ఎలిమెంట్ గా ఉంది. పైగా అనసూయ వేశ్య పాత్రలో నటించింది. కావల్సినంత మసాలా ఉండేలా ఆ పాత్రను డిజైన్ చేస్తూనే కథకి తగ్గట్టుగా ఉండనుందని తెలుస్తుంది. ట్రైలర్ లో ఆ పాత్ర హైలైట్ అయింది.
సముద్రఖని , రాహుల్ రామకృష్ణ , ధన్ రాజ్ ఈ కాస్టింగ్ తో సినిమాకు టికెట్టు తెగడం కొంత కష్టమే అనిపిస్తుంది. పైగా ఎమోషనల్ డ్రామా. ఎంత లేదన్నా అనసూయ మీదే విమానం భారం పడనుంది. మొదటి రోజు అంతో ఇంతో కలెక్షన్స్ తెచ్చే సత్తా ఆమెకే ఉంది మరి. అనసూయ కోసం, అలాగే ట్రైలర్ నచ్చి వెళ్ళే వాళ్ళే మొదటి రోజు తీయటర్స్ లో కనిపిస్తారు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ చిన్న సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో ?
This post was last modified on June 7, 2023 8:03 pm
రాజా సాబ్ నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. దర్శకుడు మారుతీ లిరికల్స్ కు పరిమితం కాకుండా ఏకంగా వీడియో…
చెల్లెలికి బర్త్డే విషెస్ చెప్పని అన్న… వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా! పాలిటిక్స్లో అది ఎవరై ఉంటారు? అని ఎవరైనా…
సినిమాల్లో కంటెంట్ ఎలా ఉందన్న దాని కంటే.. ఆ సినిమా టీంలో ముఖ్యమైన వ్యక్తుల మాటతీరును, నడవడికను బట్టి కూడా సినిమాకు ఓపెనింగ్స్…
తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే.…
అఖండ 2 తాండవంతో గత వారం గడిచిపోయాక ఇప్పుడు మూవ్ లవర్స్ చూపు కొత్త ఫ్రైడే మీదకు వెళ్తోంది. బాలయ్య…
ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలిం మేకర్స్ ఆరాధనాభావంతో చూసే దర్శకుడు జేమ్స్ క్యామరూన్. అవతార్ అనే ఊహాతీత లోకాన్ని సృష్టించి…