ఒక ఏడు నెలలు వెనక్కి వెళ్తే ‘ఆదిపురుష్’ సినిమా మీద ఎంత నెగెటివిటీ నెలకొందో గుర్తుండే ఉంటుంది. బహుశా ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఒక టీజర్ మీద అంత ట్రోలింగ్ ఎన్నడూ జరిగి ఉండదేమో. ఆ టీజర్లో విజువల్ ఎఫెక్ట్స్.. రావణుడు, హనుమంతుడి పాత్రల మేకప్ విషయమై విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఏకంగా ఐదొందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా మీద విపరీతమైన నెగెటివిటీ ముసురుకోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడింది చిత్ర బృందం.
అభిమానులు, మీడియాకు ప్రత్యేకంగా త్రీడీ టీజర్ ప్రదర్శించినా.. పరిస్థితి మారలేదు. అప్పుడున్న నెగెటివిటీలో సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే కొంప మునిగేదేమో. తీవ్రతను గ్రహించి.. వీఎఫెక్స్ సహా అన్ని విషయాల్లో మళ్లీ వర్క్ చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాను ఐదు నెలలకు పైగా వాయిదా వేశారు. ఐతే కొత్త డేట్ దగ్గరపడుతుండగా.. రిలీజ్ చేసిన కొన్ని ప్రోమోలు కూడా ఆకట్టుకోకపోవడంతో నెగెటివిటీ కొనసాగింది.
‘ఆదిపురుష్’ ఎప్పుడు వచ్చినా డిజాస్టరే అవుతుందన్న అభిప్రాయం జనాల్లో బలపడిపోయింది. కానీ ఆశల్లేని స్థితిలో ‘జై శ్రీరామ్’ పాట ఈ సినిమా పట్ల జనాల దృష్టిని కొంచెం మార్చింది. ఆ పాటతో మొదలైన పాజిటివిటీ.. ట్రైలర్ లాంచ్ తర్వాత మరింత పెరిగింది. అప్పటికి నెగెటివిటీ అంతా దాదాపుగా తగ్గిపోయింది. ఒక్కసారి పాజిటివిటీ మొదలయ్యాక చిత్ర బృందంలో ఉత్సాహం రెట్టింపైంది. పబ్లిసిటీ ఊపు మరింత పెరిగింది.
తాజాగా తిరుపతి వేదికగా నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్ సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఈ వేడుకకు వేదికను అలంకరించిన తీరు.. అభిమానుల కోసం చేసిన ఏర్పాట్లు.. ఈవెంట్‌ను నిర్వహించిన వైనం.. ప్రభాస్ సహా అందరి ప్రసంగాలు.. దీనికి మీడియాలో దక్కిన కవరేజీ.. అన్నీ కూడా సినిమా పట్ల సానుకూలతను పెంచాయి. కొత్తగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. మొత్తంగా సినిమాకు ఇప్పుడు మాంచి హైప్ కనిపిస్తోంది. ఈ సినిమా మొదలైనపుడు ఏం కోరుకున్నారో అది ఇప్పుడు జరుగుతున్నట్లే కనిపిస్తోంది. సినిమాకు ఓపెనింగ్స్ ఒక రేంజిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.
This post was last modified on June 7, 2023 7:51 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…