స్వామీజీలు, సన్యాసులు అనగానే సినిమాలకు దూరంగా ఉంటారు. ఆయా ఫంక్షన్లకు కూడా కడు దూరంపాటిస్తారు. అయితే.. ఆధునిక పరిస్థితిలో స్వాములు, సన్యాసులకు సినిమాలు-రాజకీయాలతో అనిభావ సంబంధం ఏర్పడిపోయింది. నటులు వెళ్లి వారిని కలవడం.. నటులను వీరు కొనియాడడం, రాజకీయ నేతలు మిలాఖత్ కావడం.. నేతలకు వీరు దిశానిర్దేశం చేయడం వంటివి ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి తిరుపతిలో నిర్వహించిన ప్రభాస్ మూవీ ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తళుక్కుమన్నారు. దీంతో టీవీల ముందు కూర్చున్నవారు నోరెళ్ల బెట్టారు. సినిమా పంక్షన్‌లో సాములోరేంటా? అని వారిలో వారే ప్రశ్నించుకున్నారు. ఇక, ఈ సందర్భంగా మైకందుకున్న చినజీయర్ సాములోరు.. ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో ఎత్తేశారు.
చినజీయర్ అనుగ్రహ భాషణం.. ఇదీ!
‘ప్రియ భగవత్ బంధువుల్లారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం.. నిజమైన ‘బాహుబలి’ రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతిఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఈ మట్టిపైన నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు’’ అని చెప్పారు.
‘‘మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్‌కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’’ అని చినజీయర్ స్వామి అన్నారు.
This post was last modified on June 7, 2023 10:47 am
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…