Movie News

‘ఫిదా’ మహేష్ చేసి ఉంటే..

సినీ పరిశ్రమలో కథలు చేతులు మారడం కొత్తేమీ కాదు. ఎవరో చేయాల్సిన కథను ఇంకెవరో చేయడం తరచుగా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కథను మిస్సయినందుకు కొందరు హీరో రిగ్రెట్ ఫీలవుతారు. కొన్ని సందర్భాల్లో హమ్మయ్య అనుకుంటారు. ఐతే కొన్ని కథలు మంచి ఫలితాన్నిచ్చినా కూడా వాటిని వదులుకున్న హీరోలు ఫీలవ్వరు. ఆ కథల్ని మనం చేస్తే బాగుండేది కాదు అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఇలాంటి ఉదాహరణే ఇప్పుడు ఒకటి చూద్దాం. శేఖర్ కమ్ముల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఫిదా’ సినిమాను ఆయన మహేష్ బాబుతో చేద్దామని అనుకున్నారట. ఆయన్ని దృష్టిలో ఉంచుకునే కథ రాశారట. అంతే కాదు.. మహేష్ బాబుకు ఆ కథను చెప్పగా ఆయనకు నచ్చి సినిమా చేస్తానని కూడా చెప్పారట. కానీ తీరా సినిమా మొదలుపెడదాం అనుకునే సమయానికి మహేష్ డేట్లు ఖాళీ లేవట.

ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ కమ్ములనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మహేష్ బాబు హీరోగా, బాలీవుడ్ భామ దీపికా పదుకొనే కథానాయికగా ఈ చిత్రం చేయాలనుకున్నట్లు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కానీ హీరోల డేట్లు వాళ్ల చేతుల్లో కూడా ఉండవని.. ఈ సమస్యతోనే కథ నచ్చినా సినిమా చేయలేకపోతున్నట్లు మహేష్ చెప్పడంతో వరుణ్‌ను ఎంచుకున్నానని.. కథానాయికను కూడా మార్చేశానని శేఖర్ తెలిపాడు.

కానీ నిజంగా మహేష్ ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేది అనే ఊహలోకి వెళ్తే.. ఈ సబ్జెక్ట్ అతడికి కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కలుగుతుంది. మహేష్ లాంటి సూపర్ స్టార్‌ ఇమేజ్‌కు ఈ కథ సూటయ్యేది కాదేమో. హీరోయిన్ పాత్ర చాలా డామినేట్ చేసే సినిమాలో మహేష్‌ను చూసి అభిమానులు తట్టుకోలేకపోయేవారేమో. యాక్షన్‌కు స్కోప్ లేని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి క్లాస్ సినిమాలతో మహేష్ మెప్పించినప్పటికీ.. ‘ఫిదా’ అయితే అతడికి సూటయ్యేది కాదన్నది స్పష్టం.

This post was last modified on June 5, 2023 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago