ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్ లు సినిమాల రేంజ్ లో అంచనాలు మోసుకొస్తున్నాయి. వాటిలో స్కూప్ ఒకటి. మూడేళ్ళ క్రితం వచ్చిన స్కామ్ 1992 తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు హన్సల్ మెహతా ఈసారి నెట్ ఫ్లిక్స్ నిర్మించిన స్కూప్ తో వచ్చారు. ఇది కూడా రియల్ స్టోరీనే. ప్రముఖ క్రైమ్ లేడీ జర్నలిస్ట్ జిగ్నా ఓరా తన స్వీయానుభవాలతో రాసిన ‘బిహైండ్ బార్స్ ఇన్ బైకుల్లా-మై డేస్ ఇన్ ప్రిజన్’ ఆధారంగా దీన్ని రూపొందించారు. ఆరు ఎపిసోడ్లతో మొత్తం కలిపి ఆరు గంటల నిడివి ఉన్న స్కూప్ కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ముందు కథ చూద్దాం
ఈస్టర్న్ ఏజ్ దినపత్రికలో పని చేసే జాగృతి పాఠక్(కరిష్మ తన్నా) వివిధ రకాల సోర్స్ నుంచి వార్తలు సేకరిస్తూ సంచలనాత్మక కథనాలతో పాపులర్ అవుతుంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో కొందరు అధికారులు సైతం సహకరిస్తూ ఉంటారు. బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించిన ఓ కేసుకు సంబంధించి దావూద్ ఇబ్రహీం పాత అనుచరుడు ఛోటా రాజన్ ని ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ పాత్రికేయుడు జైదేబ్ సేన్ (ప్రోసేన్ జిత్)హత్యకు గురవుతాడు. మాఫియాతో సంబంధాలున్నాయనే నెపంతో జాగృతిని మోకా చట్టం కింద అరెస్ట్ చేసి ఎనిమిది నెలలు జైల్లో ఉంచుతారు. తర్వాత జరిగేది సిరీస్ లో చూడాలి
అండర్ వరల్డ్ తో సావాసం చేసే జర్నలిస్టులు ఎంత ప్రమాదకర పరిస్థితులను ఎదురుకోవాల్సి ఉంటుందో స్కూప్ లో ఆకట్టుకునే రీతిలో చూపించారు. మధ్యలో కొంత డిటైలింగ్ వల్ల ల్యాగ్ వచ్చినప్పటికీ కరిష్మా టన్నా అద్భుత నటనతో పాటు మిగిలిన ఆర్టిస్టుల సహజమైన పెర్ఫార్మన్స్ ఆ వీక్ నెస్ ని కవర్ చేసింది. ఎనిమిదేళ్ల కొడుకు, వదిలేసిన భర్త, తనమీదే ఆధారపడ్డ తల్లితండ్రులతో జిగ్నా ఓరా పడిన నరకాన్ని హృద్యంగా ఆవిష్కరించారు. జైల్లో సన్నివేశాలు, కోర్ట్ రూమ్ డ్రామా ఈ స్కూప్ ని బలంగా నిలబెట్టాయి. తెలుగు ఆడియో ఇచ్చారు కాబట్టి మన ఆడియన్స్ కూ కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి
This post was last modified on June 5, 2023 2:34 pm
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…