Movie News

మహేష్ మీద చిరుకు ఎంత ప్రేమో..

ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతటా మహేష్ పేరు మార్మోగిపోతోంది. తండ్రి వారసత్వాన్నందుకుని నటనలోకి వచ్చిన మహేష్.. తండ్రిలాగే సూపర్ స్టార్ అనిపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. పెద్ద మాస్ హీరోగా ఎదగడమే కాదు.. నటుడిగానూ చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించాడు. అవార్డులు కొల్లగొట్టాడు.

‘ఒక్కడు’తో మొదలుపెట్టి తరచుగా రికార్డుల మోత మోగిస్తూ సాగిసోతున్నాడు మన సూపర్ స్టార్. చివరగా సంక్రాంతికి విడుదలైన మహేష్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ యావరేజ్ కంటెంట్‌తోనే కలెక్షన్ల మోత మోగించింది. ఇప్పుడిక ‘సర్కారు వారి పాట’తో సందడికి సిద్ధమవుతున్నాడు మహేష్. పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన దీని మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలందరూ మహేష్‌ మీద తమ అభిమానాన్ని చూపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. అందరిలోకి మెగాస్టార్ చిరంజీవి విష్ ప్రత్యేకం. మహేష్‌ను తన బిడ్డలా భావిస్తానంటూ ‘సరిలేరు..’ ఆడియో వేడుకలో ఎంత ప్రేమగా మాట్లాడాడో తెలిసిందే. తన ట్వీట్లో కూడా మహేష్ మీద ప్రేమను దాచుకోలేదాయన. ‘‘అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ కలలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బర్త్ డే మహేష్. ఈ ఏడాదంతా నీకు గొప్పగా సాగాలి’’ అని చిరు ట్వీట్ వేశాడు.

మహేష్‌ను మీరు అని గౌరవిస్తూ చిరు ఇలా ట్వీట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. మహేష్‌ను అన్నా అని సంబోధిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే.. ట్విట్టర్ రికార్డుల అంతు చూడటమే లక్ష్యంగా ‘హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు’ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల మోత మోగిస్తున్నారు.

This post was last modified on August 10, 2020 11:43 am

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

11 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

11 hours ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

11 hours ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

11 hours ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

13 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

15 hours ago