ఊర్వశి వెంటపడుతున్న ఆఫర్లు  

ఇటీవలే ముంబై జుహు ప్రాంతంలో  నూటా తొంభై కోట్ల విలువ చేసే బంగాళా తీసుకుందనే వార్తతో హాట్ టాపిక్ గా మారిన ఊర్వశి రౌతేలా అందులో నిజమెంతుందో మాత్రం బయటికి చెప్పలేదు. ఇది సుప్రసిద్ధ నిర్మాత దివంగత యష్ చోప్రా బిల్డింగ్ కు అనుకునే  ఉందట. కాంపౌండ్ వాల్ ఇద్దరికీ ఒకటే అంటేనే అర్థం చేసుకోవచ్చు అమ్మడు కొన్న ఆస్తి ఏ రేంజో. అత్యంత ఖరీదయిన విలాసాలతో కూడిన ఈ ఇంట్లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో తెలియదు కానీ అసలు అంత డబ్బు ఎలా సంపాదించిందనే దాని మీద ఫ్యాన్స్ లోనే బోలెడు ప్రశ్నలు. ఇక అసలు విషయానికి వద్దాం.

వాల్తేరు వీరయ్యలో వెరీజ్ ది పార్టీ అంటూ చిరంజీవితో ఆడిపాడిన ఊర్వశి రౌతేలా ఆ తర్వాత ఏజెంట్ లోనూ మరిపించింది. నిర్మాణంలో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి బోయపాటి శ్రీను సినిమాలో చిందులేసింది. తాజాగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజల కాంబినేషన్ లో రూపొందుతున్న బ్రోలోనూ ఒక పబ్ సాంగ్ లో కాలు కదుపుతుందట. ఇటీవలే దీని తాలూకు సెట్ ని హైదరాబాద్ లో వేయించారు. ఇలా మొత్తం నాలుగు క్రేజీ స్పెషల్ సాంగ్స్ ఆఫర్స్ తో ఊర్వశి డిమాండ్ మాములుగా లేదు. ఇంకొన్ని డిస్కషన్ స్టేజిలో ఉంది ఓపిక కాబోతున్నాయి

సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ అడుగుతున్నా వేరే ఆప్షన్లు లేకపోవడంతో నిర్మాతలు సరేనంటున్నారు పదేళ్ల క్రితం కెరీర్ మొదలుపెట్టిన ఊర్వశి రౌతేలా పదుల సంఖ్యలో సినిమాలు చేయలేదు కానీ బాలీవుడ్ లో సింగ్ సాబ్ ది గ్రేట్, కాబిల్, పాగల్ పంటి లాంటి హిట్లున్నాయి. హీరోయిన్ గా ట్రాక్ రికార్డు పక్కనపెడితే 2018లో అండమాన్ నికోబర్ ప్రభుత్వం తనను మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ గా సత్కరించింది. 2020 అరబ్ ఫ్యాషన్ ,కౌన్సిల్ నిర్వహించిన షోలో పాల్గొన్న ఏకైక భారతీయురాలిగా రికార్డు సాధించింది. మొరాకో గవర్నమెంట్  ఐకాన్ గౌరవం అందించింది.