Movie News

ఫ్రీ షోల వెనుక ఆంతర్యం ఏమిటో

తక్కువ బడ్జెట్ తో రూపొంది, టాక్ మిక్స్డ్ గా ఉన్నా జరిగిన బిజినెస్ కు తగ్గట్టు బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వెళ్ళిపోయిన మేం ఫేమస్ మీద మొదటి మూడు నాలుగు రోజులు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా దీన్ని యావరేజ్ అన్నా బాలేదన్నా నిర్మాతలు ఏ మాత్రం ఒప్పుకోలేకపోవడం పంచాయితీ పేరుతో చేసిన ప్రెస్ మీట్ లోనూ బయట పడింది. ట్విట్టర్ నెగటివిటీకి అవసరానికి మించి రియాక్ట్ అవ్వడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఫైనల్ గా మేం ఫేమస్ ని సక్సెస్ ఫుల్ మూవీగా చెప్పుకోవచ్చు కానీ బ్లాక్ బస్టరనో ఫ్లాపనో స్టాంప్ వేయలేం.

ఛాయ్ బిస్కెట్ టీమ్ మాత్రం ప్రమోషన్ల విషయంలో స్పీడ్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ వారం తెలంగాణలోని ఎంపిక చేసిన నగరాల్లో రోజు సాయంత్రాలు ఫ్రీ షోలు వేసి టీమ్ తో సహా వెళ్ళిపోయి యూత్ ని కలుస్తోంది. ఉచిత ప్రదర్శనలు కాబట్టి సహజంగానే ఇవి కిక్కిరిసిపోతున్నాయి. యాభై అయిదు థియేటర్లకు పైగా స్టూడెంట్ ఐడి కార్డు ఉన్న వాళ్లకు తొంభై తొమ్మిది రూపాయలకే టికెట్ స్కీం పెట్టినా అది మరీ ఆశించిన అద్భుతాలు చేయలేకపోయింది. ఒకటో తేదీతో మొదలుపెట్టి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో రోజుకు ఒక చోట చొప్పున ఫ్రీ షోలు జరిగాయి.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం లాభాలు వచ్చినా మేం ఫేమస్ కి ఇంకా ఓటిటి, శాటిలైట్ డీల్స్ అవ్వలేదు. ఒకవేళ జాతిరత్నాలు తరహాలో పాతిక ముప్పై కోట్లు వసూలు చేసే రేంజ్ లో ఆడివుంటే ఇప్పుడీ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడేది. కానీ ఆలా జరగలేదు.  ఈ వీకెండ్ లోపు ఆరేడు కోట్లను దాటాకపోవచ్చు. ఫైనల్ రన్ అయ్యేలోపు పది కోట్లను టచ్ చేస్తే గొప్ప అచీవ్ మెంట్ అవుతుంది. కొత్తగా వచ్చిన రిలీజులకు సోసో టాక్ రావడం మేం ఫేమస్ కి కలిసి రావొచ్చు. అది ఎంత శాతం అనేది సోమవారం ఉదయానికి బయటికి వచ్చే వీకెండ్ ఫిగర్లను బట్టి తేలిపోతుంది. అందుకే పబ్లిసిటీ స్పీడ్ పెంచేశారు 

This post was last modified on June 3, 2023 11:53 pm

Share

Recent Posts

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

4 minutes ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

14 minutes ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

36 minutes ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

58 minutes ago

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

3 hours ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

3 hours ago