మాస్ మహారాజా రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేయడం కాదు కదా కనీసం దగ్గరికి వెళ్లడం కూడా కష్టమే. అలాంటిది ఏకంగా అతన్ని మించి అనేలా ఎవరి గురించైనా మాట్లాడితే ఫ్యాన్సే కాదు సగటు టాలీవుడ్ మూవీ లవర్స్ ఎవరూ ఒప్పుకోరు. మొన్న జూన్ 1 అక్షయ్ కుమార్ రౌడీ రాథోర్ పదకొండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఒరిజినల్ ని మరిపించేలా ఇందులో అక్కి అదరగొట్టారని ఆ సినిమా తాలూకు ఫోటోలతో ఒక శీర్షిక పెట్టింది. ఇది విక్రమార్కుడు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ వెర్షన్ కి డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
అసలు ఈ పోలికే పెద్ద కామెడీ. విక్రమార్కుడు ఒక కమర్షియల్ డ్యూయల్ రోల్ మూవీ. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా, దొంగగా రవితేజ ఇచ్చిన పెర్ఫార్మన్స్ రాజమౌళి మాస్ ఫార్ములాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రకాష్ రాజ్ తో భయం గురించి మాట్లాడే సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్, విలన్ కొడుకుని చంపే సన్నివేశం ఒకదాన్ని మించి ఉంటాయి. అయితే అక్షయ్ కుమార్ ఈ స్థాయిలో చేయలేదన్నది వాస్తవం. ఇక్కడ చెప్పిన ఉదాహరణలు రౌడీ రాథోర్ లో చూస్తే చాలు అర్థమైపోతుంది ఎవరు బాగా చేశారరో. అందుకే ఈ కంపారిజన్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది.
తమిళంలో కార్తీ, కన్నడలో ఈగ సుదీప్, బెంగాలీ లాంటి ఇతర భాషల్లో ఆయా స్టార్ హీరోలు ఎవరు చేసినా విక్రమార్కుడి మేజిక్ వేరు. అందుకే మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటు ఇతర అభిమానులు కూడా రవితేజ బెస్ట్ అంటూ రీ ట్వీట్లు కొట్టేస్తున్నారు. ఈ సినిమా వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అవుతోంది. రీ రిలీజ్ ట్రెండ్ ఉధృతంగా ఉన్న సమయంలో దీన్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడాలని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. మొన్నా మధ్య మిరపకాయ్ చేశారు కానీ దానికంత స్పందన రాలేదు. కానీ విక్రమార్కుడు వేస్తే మాత్రం హైప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందనేది వాస్తవం.
This post was last modified on June 3, 2023 12:05 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…