సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి.. ఈ కాంబినేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో అదిగో అంటూనే ఏల్లకు ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఈ కాంబినేషన్ ఉండదులే అనే నిరాశలో ఉన్న సమయంలో రాజమౌళి సూపర్ స్టార్ అభిమానులకు జోష్ ఇచ్చే కబురు చెప్పాడు.
‘ఆర్ఆర్ఆర్’ అయ్యాక తన తర్వాతి సినిమా మహేష్ బాబుతోనే అని తేల్చేశారు. ఇక అప్పట్నుంచి వీళ్ల కలయికలో ఎలాంటి సినిమా వస్తుందనే చర్చ మొదలైపోయింది.
ఇంతకుముందు తాను మహేష్ బాబుతో సినిమా చేస్తే జేమ్స్ బాండ్ తరహా మూవీ చేస్తానంటూ జక్కన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో అలాంటి సినిమా అయితే ఎలా ఉంటుందనే డిస్కషన్లలో మునిగిపోయారు ఫ్యాన్స్. కొందరేమో రాజమౌళి స్టయిల్లో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా చేస్తే మహేష్‌ను డిఫరెంటుగా చూడొచ్చంటున్నారు. ఇంకొందరు కౌబాయ్ టైపు సినిమా చేస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు.
ఇంతకీ రాజమౌళి ఆలోచన ఎలా ఉందన్నది ఎవ్వరికీ తెలియదు. ఐతే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు జక్కన్న. మహేష్‌తో తన సినిమా గురించి ఇప్పుడే ఊహాగానాలు అవసరం లేదని.. ఇంకా తాము ఏమీ అనుకోలేదని జక్కన్న తేల్చేశాడు. మహేష్‌తో జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది..
నిజమేనా అని అడిగితే.. ‘‘ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మహేష్ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌తో పాటు నా అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందా సినిమా. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాతే తదుపరి సినిమా మొదలుపెట్టాలి. మహేష్‌తో కూడా ఇంకా కథ గురించి చర్చించలేదు’’ అని రాజమౌళి స్పష్టం చేశాడు.
కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ అయ్యే వరకు రాజమౌళి-మహేష్ సినిమా గురించి ఊహాగానాలు ఆపేస్తే బెటరేమో. సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణ బేనర్లో రాజమౌళి ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 24, 2020 2:04 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…