ఎన్నో ఆశలు పెట్టుకున్న కస్టడీ ఇచ్చిన షాక్ నుంచి క్రమంగా బయటపడుతున్న నాగ చైతన్య నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందబోతున్న సంగతి తెలిసిందే. కథకు సంబంధించిన కీలకమైన పాయింట్ స్వయంగా నిర్మాత బన్నీ వాస్ నుంచే బయటికి వచ్చింది. ఇది గుజరాత్ లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా రాసుకున్నారు. ఇందులో చైతు బోటు డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ప్రేమకథతో పాటు ఎమోషన్స్, యాక్షన్స్, ఎలివేషన్స్ అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయట. ఉప్పెన తరహాలో సముద్రం బ్యాక్ డ్రాప్ అన్నమాట.
చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందబోయే ఈ హై వోల్టేజ్ డ్రామాకు సుమారు అరవై కోట్ల దాకా బడ్జెట్ కేటాయించబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంటే చైతు కెరీర్ లో హయ్యెస్ట్ ఇదే అవుతుంది . సబ్జెక్టు అంత డిమాండ్ చేయడంతో ఆమేరకు అల్లు అరవింద్ ఎస్ చెప్పేశారట. బ్యాక్ డ్రాప్ ని బట్టి చూస్తే నాగ చైతన్య ఇందులో ఎక్కువ శాతం గళ్ళచొక్కా, చారల పంచతో కనిపించబోతున్నాడు. 2018 ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ వాస్ ఓపెన్ కావడంతో ఈ విషయం బయట పడింది. అక్కినేని ఫ్యాన్స్ ఇది చూసి హమ్మయ్య అనుకుంటున్నారు.
గత ఏడాది వరకు వరస ఫ్లాపులు చవిచూసిన గీత ఆర్ట్స్ 2కి వినరో భాగ్యము విష్ణు కథ కొంత రిలీఫ్ ఇచ్చింది కానీ తమ బ్యానర్ రేంజ్ బ్లాక్ బస్టర్ కోసం ఇంకా ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇటుపక్క చైతు థాంక్ యు, లాల్ సింగ్ చద్దా, కస్టడీ హ్యాట్రిక్ డిజాస్టర్ల తరువాత మంచి కసి మీదున్నాడు. సో ఇప్పుడీ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టమైనా పడతాడు. కమిట్ మెంట్లో లోపాలు లేకపోయినా ఫలితాల్లో శాపాల వల్ల సక్సెస్ విషయంలో ఎత్తుపల్లాల ప్రయాణం కొనసాగిస్తున్న చైతు ఇకపై జాగ్రత్తగా ఉంటా అంటున్నాడు. డిజిటల్ డెబ్యూ దూత వెబ్ సిరీస్ గురించి ప్రైమ్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు
This post was last modified on June 2, 2023 8:39 am
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో…
మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై ఏపీ శాసన మండలి సమావేశాల్లో పెను దుమారం రేగింది. జగన్…
వైసీపీ ఎంపీగా గెలిచిన కొద్ది నెలల తర్వాత ఆ పార్టీపై రఘురామకృష్ణరాజు తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై పెట్టిన…
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…