పేరుకు మలయాళ నటుడే కానీ.. దుల్కర్ సల్మాన్‌ను మన వాళ్లు పరభాషా నటుడిగా అస్సలు చూడరు. ఆ మాటకొస్తే తమిళులు కూడా అలా ఫీల్ కారు. ‘ఓకే బంగారం’ చిత్రంతో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అతను అరంగేట్రంలోనే కట్టి పడేశారు. ఆ తర్వాత ‘మహానటి’తో మరింతగా మెప్పించాడు. ఇక ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాడో అందరికీ తెలిసిందే.
ఈ సినిమా సూపర్ సక్సెస్ తర్వాత బోలెడన్ని అవకాశాలు వచ్చినా దుల్కర్ తొందరపడట్లేదు. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఇటీవలే వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పుడు తెలుగులో దుల్కర్ మరో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాత అనే వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది.
తన ‘స్పిరిట్ మీడియా’ బేనర్ మీద యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు రానా దగ్గుబాటి. ఇదే బేనర్లో దుల్కర్ హీరోగా ఓ సినిమాను నిర్మించడానికి అతను రంగం సిద్ధం చేస్తున్నాడట. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో కొంత కాలంగా పని చేస్తున్న ఒక యంగ్ టెక్నీషియన్‌ను రానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయనున్నాడట.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపు దిద్దుకోనున్నట్లు సమాచారం. ఆటోమేటిగ్గా అది మలయాళంలోకి అనువాదం అవుతుంది. ప్రస్తుతం దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కోథా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే వెంకీ అట్లూరి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత రానా ప్రొడక్షన్లో సినిమా ఉంటుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సముద్రఖని ముఖ్య పాత్ర పోషించనున్నాడట.
This post was last modified on June 2, 2023 8:09 am
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…