ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు దర్శకుడు సురేందర్ రెడ్డి మళ్ళీ బయట ఎక్కడా కనిపించలేదు. కనీసం యావరేజ్ అయినా ఓ మాదిరిగా ఉండేదేమో కానీ అక్కినేని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుంటే కనీస స్థాయిలో ఆడకపోవడం తీవ్ర నిరాశను కలిగించింది. పైగా నిర్మాత అనిల్ సుంకర పూర్తి స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ మొదలుపెట్టామని ట్విట్టర్ లో ఒప్పుకోవడం సూరి బాధ్యతారాహిత్యాన్ని తేటతెల్లం చేసింది. అయితే ఆలా ఎందుకు చేశారని ఏదైనా భవిష్యత్తు ఇంటర్వ్యూలో సమాధానం దొరకొచ్చేమో కానీ ప్రస్తుతానికి ఆ నిందను కొన్నాళ్ళు మోయక తప్పదు.
ఇంత జరిగాక స్టార్ హీరోలు లేదా ప్రొడ్యూసర్లు కొంత దూరంగా ఉండటం సహజం. అయితే సురేందర్ రెడ్డికి ఆ టెన్షన్ లేదు. ఎందుకంటే నిర్మాత అల్లు అరవింద్ కి గతంలో ఇచ్చిన కమిట్ మెంట్ ఇప్పుడు కార్యరూపం దాల్చబోతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ధృవ షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇంకో ప్రాజెక్టు చేద్దామని ఇద్దరూ పరస్పరం అనుకున్నారు కానీ రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే అడ్వాన్స్ తీసుకోవడం మాత్రం జరిగిపోయింది. సో ఆలస్యంగా అయినా ఇప్పుడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబో మళ్ళీ రిపీట్ కావడం ఖాయమైపోయింది
అయితే ఇది ధృవ 2 మాత్రం కాదు. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ దర్శకుడు మోహన్ రాజా సీక్వెల్ తనే చేస్తానని ఆల్రెడీ చెప్పేశారు . సో సురేందర్ రెడ్డి కొత్త కథను రాసుకోవాలి. అయితే హీరోగా ఎవరు ముందుకు వస్తారనేది అల్లు అరవింద్ చేతిలో ఉంది. సూరి మీద నమ్మకం కన్నా అరవింద్ మాటకే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ప్రస్తుతానికి అది సస్పెన్సే. పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిన సురేందర్ రెడ్డికి ఇంకా ఆశలు అడుగంటిపోలేదు. సరైన కథ రీజనబుల్ బడ్జెట్ లో వస్తే పవర్ స్టార్ నో చెప్పడు. కాకపోతే చాలా టైం పడుతుంది
This post was last modified on June 2, 2023 8:28 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…