అభిమానులు కోరుకున్న విధంగా స్టార్ హీరోలను చూపించడం అన్నది ఇప్పుడు ట్రెండుగా మారిపోతోంది. ఫ్యాన్స్, మాస్ స్టఫ్ లేకుండా సినిమాలు తీస్తే.. సినిమా బాగున్నా కూడా అభిమానుల్లో అసంతృప్తి తప్పట్లేదు. మేం కోరుకున్నది ఇది కాదు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ హీరో చేసిన పాత సినిమాలను గుర్తు చేస్తూ.. ఇది కదా మాక్కావాల్సింది అంటున్నారు.
థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న ఈ రోజుల్లో.. అభిమానులను సంతృప్తి పరచకపోతే ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతోంది. దీంతో ఫ్యాన్స్ ఆకాంక్షలకు తగ్గట్లుగా సినిమాలు చేయడానికి హీరోలు, దర్శకులు కూడా ప్రయత్నిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన తొలి రెండు చిత్రాలు రీమేక్‌లు. అందులో మాస్ అంశాలకు స్కోప్ తక్కువ. ఉన్నంతలో ఫ్యాన్ మూమెంట్స్ కోసం ట్రై చేసినా వాళ్లలో అసంతృప్తి నెలకొంది. పవన్ తర్వాతి చిత్రం ‘బ్రో’ కూడా వాళ్లను సంతృప్తి పరిచే చిత్రం కాదు.
ఇలాంటి టైంలోనే హరీష్ శంకర్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలుపెట్టాడు పవన్. ఆ సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ గ్లింప్స్ రెడీ చేస్తే.. పవన్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఒక వీరాభిమానిగా పవన్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో హరీష్‌కు బాగా తెలుసనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి టీజర్ చూశాక. ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా మాస్‌గా, స్టైలిష్‌గా పవన్‌ను ప్రెజెంట్ చేసి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు హరీష్. ఇది కదా మాక్కావాల్సిందే అనే మాట అభిమానుల నుంచి వినిపించింది.
ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి ఆనందంలోనే ఉన్నారు. మహేష్ చాలా కాలంగా క్లాస్ టచ్ ఉన్న.. మాస్ టచ్ లేని పాత్రలే చేస్తూ వచ్చాడు. తన లుక్స్, మేనరిజమ్స్ ఒకేలా ఉండటం అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది. ఇలాంటి టైంలో త్రివిక్రమ్ లాంటి క్లాస్ డైరెక్టర్.. మహేష్‌ను ‘గుంటూరు కారం’లో మాస్‌గా ప్రెజెంట్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసేదే. సినిమాలో మాస్ ట్రీట్ ఖాయం అనే సంకేతాలను టీజర్ ఇచ్చింది. సినిమా రొటీన్‌గా ఉన్నా.. మహేష్ మాస్‌గా ఉండాలని.. అతను ‘ఖలేజా’లో మాదిరి తెర మీద అల్లరల్లరి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీజర్లో మహేష్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, బీడీ డైలాగ్.. అన్నీ కూడా మాస్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
This post was last modified on June 1, 2023 7:33 pm
ఏపీలో రాజకీయం నానాటికీ రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఖాళీ అయిపోతూ ఉంటే… రికార్డు విక్టరీ కొట్టిన…
2025 తొలి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ నమోదు చేసే దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం పది రోజులకే 230…
భారీ అంచనాలతో రామ్ చరణ్ మూడేళ్లు వెచ్చించిన గేమ్ ఛేంజర్ విడుదల రోజు నుంచి ఎన్ని ఇక్కట్లు పడుతోందో చూస్తూనే…
కొత్త చట్టాల్ని చేసినప్పుడు.. వాటికి సంబంధించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగాలి. అదేం లేకుండా.. చట్టం చేశాం.. మీకు తెలీదా?…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తాజా విదేశీ పర్యటన నిజంగానే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పక తప్పదు.…
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇంటిలోకి చొరబడ్డ ఆ దొంగ ఏం తీసుకెళ్లలేకపోయాడు గానీ… అతడి కత్తి మాత్రం…