వంద రోజుల సెంటర్లు, కలెక్షన్ల రికార్డుల గురించి కొట్టుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ట్వీట్ వార్ నడుస్తోంది హీరోల అభిమానుల మధ్య. తమ హీరోల పుట్టిన రోజులకు, ఇంకేవైనా సందర్భాల్లో ఎవరెక్కువ ట్వీట్లు వేశారన్నది ప్రతిష్టాత్మకంగా మారింది.
మే నెలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. అతడి పుట్టిన రోజు నాడు ఒక్క రోజు వ్యవధిలో 21.5 మిలియన్ ట్వీట్లతో కొత్త రికార్డు నెలకొల్పారు. ఆ రికార్డును పవన్ కళ్యాణ్ అభిమానులు అలవోకగా బద్దలు కొట్టేశారు. అది కూడా అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్రెండుతో. కావడం విశేషం. 24 గంటలు తిరిగేసరికి దాదాపు 28 మిలియన్ ట్వీట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ఐతే ఇంతలో మహేష్ బాబు పుట్టిన రోజువచ్చింది. ఆదివారం సూపర్ స్టార్ బర్త్ డే కాగా.. ముందు రోజు సాయంత్రం మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా హంగామా మొదలైంది. వారి ధాటికి వరల్డ్ ట్రెండ్స్‌లో మహేష్ బాబు బర్త్‌డే హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ప్లేస్‌లో నిలవడమే కాకుండా.. వరల్డ్ ఫాస్టెస్ట్ 10 మిలియన్ ట్వీట్స్ రికార్డ్ మహేష్ పేరిట నమోదైంది.
ఎన్ని గంటల్లో, ఎంత వేగంగా ఈ రికార్డు సాధించారన్న వివరాలు వెల్లడి కాలేదు. కానీ రికార్డయితే మహేష్ ఫ్యాన్స్ ఖాతాలో చేరింది. మరి ఈ బర్త్‌డే ట్యాగ్ 24 గంటల్లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో.. త్వరలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుల కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు ఎలాంటి టార్గెట్లు ఇస్తుందో చూడాలి.
This post was last modified on August 9, 2020 6:17 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…