గుంటూరు కారం టీజర్ వచ్చి గంటలు కాదు నిముషాలు గడవక ముందే తమన్ మీద కాపీ మరక వచ్చేసింది. మహేష్ బాబు ఫైట్ చేస్తుండగా బ్యాక్ గ్రౌండ్లో సన్న కర్ర- సవా దెబ్బ- బొడ్డు రాయి – బెండు దెబ్బా- రవణ అబ్బా యుయ్ అంటూ వచ్చే చిన్న ఆడియో బిట్ బాగా సెట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఎక్కడో విన్నట్టు ఉందని గుర్తించిన ఫ్యాన్స్ వెంటనే తమ మెమరీకి పదును పెట్టారు. కట్ చేస్తే అదెప్పుడో జమానాలో వచ్చింది కాదు గత ఏడాది రిలీజైన విజయ్ సేతుపతి కెఆర్కె(కణ్మణి రాంబో కతిజ)లోని డిప్పమ్ డప్పమ్ అనే పబ్ సాంగ్ నుంచి తీసుకున్నట్టు తేల్చేశారు.
రెండు పక్కపక్కనే వింటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. చాలా సులభంగా రెండు ట్యూన్లు ఒకటే అనిపిస్తాయి. కెఆర్కెకి సంగీతం ఇచ్చింది అనిరుద్ రవిచందర్. పోనీ ఒకే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఏమో అనుకోవచ్చు కానీ ఇద్దరు సంబంధం లేని కంపోజర్లకు ఒకే ఐడియా ఎలా వస్తుంది. ఈ లెక్కన అనిరుద్ కూడా ఎక్కడి నుంచైనా తీసుకున్నాడేమో ఓ రెండు రోజులు ఆగితే బయట పడవచ్చు. వీరసింహారెడ్డి టైంలో టైటిల్ సాంగ్ ఇలాగే ఒసేయ్ రాములమ్మా తరహాలో ఉందంటూ వచ్చిన కామెంట్స్ కి తమన్ చెప్పిన సమాధానం గుర్తుందిగా. మరి ఇప్పుడేం చెబుతాడో
తమన్ మీద ఇలాంటి ఫీడ్ బ్యాక్ ఇది కొత్తేమీ కాదు కానీ స్లో పాయిజన్ లాగా తన మ్యూజిక్ తో హిట్టు కొట్టడం అలవాటైపోయింది. గుంటూరు కారంకి సరిగా సమయం కేటాయించడం లేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో తమన్ దీనికి బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. పైగా గత ఆల్బమ్ సర్కారు వారి పాట ఫ్యాన్స్ కి పూర్తి సంతృప్తినివ్వలేదు. సినిమా ఎలా ఉన్నా ఒకప్పటి దూకుడు, బిజినెస్ మెన్ ఆల్బమ్ ఇవ్వలేదనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. అది చల్లారాలంటే గుంటూరు కారంకి అల వైకుంఠపురములోని మించి ఇవ్వాలి. త్రివిక్రమ్ కాబట్టి ఆ ఇబ్బంది రాదేమో
This post was last modified on May 31, 2023 8:51 pm
ఐపీఎల్ 2025 కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో బీహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మెగా…
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…