పాత హిట్ మూవీస్ టైటిల్స్ వాడుకోవడం కొత్తేమీ కాదు బాలీవుడ్ వి తీసుకోవడం మాత్రం అరుదే. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో హవీష్ హీరోగా రూపొందిన సినిమాకి ఎస్ బాస్ పేరుని లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. దీని షూటింగ్ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. ఈ మధ్య కాలంలో బ్రహ్మి చేయని ఓ ఫుల్ లెన్త్ ఎంటర్ టైన్మెంట్ క్యారెక్టర్ ని ఇందులో డిజైన్ చేశారట. ప్రమోషన్ ఇంకా మొదలు పెట్టలేదు కాబట్టి అసలు ఇది ఉందనే సంగతే ఎవరికీ తెలియకుండా పోయింది. షారుఖ్ ఖాన్ జుహీ చావ్లా జంటగా 1997లో ఎస్ బాస్ అనే సూపర్ హిట్ మూవీ వచ్చింది
దాన్ని మళ్ళీ ఎవరూ యుజ్ చేయలేదు. ఇక ఇప్పటి ఎస్ బాస్ విషయానికి వస్తే దీనికి దర్శకుడు అశోక్. ఈయన గత చిత్రం అనుష్క భాగమతి. సక్సెస్ అయ్యింది కానీ హిందీ రీమేక్ దుర్గామతి దారుణంగా డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు అంజలితో చిత్రాంగద, ఆది సాయికుమార్ తో సుకుమారుడు ఘోరంగా పోయాయి. కాస్త గట్టిగా చెప్పుకునే హిట్టంటే నాని పిల్ల జమీందార్ ఒకటే. ట్రాక్ రికార్డు ఎలా ఉన్నా అవకాశాలు వస్తూనే ఉన్న అశోక్ ఈసారి స్టార్ క్యాస్టింగ్ లేకుండా కంటెంట్ ని నమ్మి హవీష్, బ్రహ్మీలతో ఎస్ బాస్ అనే ఎంటర్ టైనర్ తో వస్తున్నారు
వినడానికి బాగానే ఉంది కానీ ఈ కాంబినేషన్ జనాన్ని థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. పబ్లిసిటీ ఓ రేంజ్ లో చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టే ప్లాన్ చేస్తున్నారట. ఎందుకంటే ఒకప్పటిలా కేవలం బ్రహ్మానందం కోసమే సినిమాకొచ్చే ఆడియన్స్ తగ్గిపోయారు. ఆయన క్యాలిబర్ ని వాడుకునే దర్శకులూ లేకపోవడం మరో సమస్య. పోనీ సీరియస్ గా ట్రై చేద్దామని చూసిన రంగమార్తాండకు కాంప్లిమెంట్స్ వచ్చాయి కానీ కాసులు రాలేదు. మరి ఈ ఎస్ బాస్ అయినా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా ఉంటుందేమో చూడాలి
This post was last modified on May 31, 2023 1:38 pm
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…