కెరీర్ ఆరంభం నుంచి ఎక్కువగా కొత్త నటీనటులతోనే పని చేస్తున్నాడు సీనియర్ దర్శకుడు తేజ. ఇప్పుడు కూడా తన కొత్త చిత్రం అహింసతో అభిరామ్, గీతికలను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. కొత్త వాళ్లతో సినిమాలు చేయడానికి.. వాళ్లు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు అందుబాటులో ఉండటం.. అలాగే తాను ఏం చెబితే అది చేయడం ఒక ముఖ్య కారణం.
దీనికి తోడు పారితోషకాల పరంగా కూడా ఇబ్బంది ఉండదు. కొత్త ఆర్టిస్టులను ఎలా కావాలంటే అలా మౌల్డ్ చేసుకుంటాడని తేజకు పేరుంది. ఈ క్రమంలో వాళ్లను తేజ పెట్టే కష్టం గురించి కూడా ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటూ ఉంటారు. కోపం వస్తే.. చెప్పినట్లు చేయకపోతే తేజ హీరో హీరోయిన్లపై చెయ్యి కూడా చేసుకుంటాడని అంటారు. ఇదే విషయాన్ని అహింస ప్రెస్ మీట్లో ఓ విలేకరి ప్రస్తావిస్తే.. నేను కొట్టడం మీరు చూశారా అంటూ ఎదురు ప్రశ్నించాడు తేజ.
ఐతే అభిరామ్‌ను తాను టార్చర్ పెట్టిన మాట మాత్రం వాస్తవం అని అంగీకరించాడు. ఆ టార్చర్ ఎలాంటిదో తేజ స్వయంగా వెల్లడించాడు. రామానాయుడు స్టూడియో కింద నుంచి కొండపై వరకు రోజూ సైకిల్ తొక్కమని అభిరామ్‌కు చెప్పా. నేను చేయలేను అనకుండా ప్రాక్టీస్ చేశాడు.తర్వాత సినిమాలో ఆ సీన్ లేదని తీసేశా. హీరోయిన్ని భుజంపై ఎత్తుకుని, మరో భుజానికి తుపాకులు తగిలించుకుని పరుగెత్తమన్నా. ఆ షాట్ తీస్తుండగా అభిజారి పడి కాలు దెబ్బ తింది.
నాలుగు నెలలు షూట్ ఆపేశాం. గాయం మానాక 50 కిలోల బరువు ఎత్తుకుని కొండ చుట్టూ పరుగెత్తమన్నా. రోజూ పరుగెత్తి వీడియో పెట్టేవాడు. ఇంతకన్నా టార్చర్ ఎవరు పెడతారు? నేను చెప్పినవన్నీ చేయాల్సిన అవసరం అభిరామ్‌కు లేదు. పెద్ద ఫ్యామిలీ, ప్రొడక్షన్ హౌస్ ఉన్నా నిజాయితీ ఉంది కాబట్టే అభిరామ్ కష్టపడ్డాడు. అందుకే తనతో సినిమా తీశా అని తేజ తెలిపాడు.
This post was last modified on May 31, 2023 1:21 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…