షూటింగ్ విషయంలో కొన్ని ఎగుడు దిగుడులు ఎదురై రకరకాల ప్రచారాలకు అవకాశమిచ్చినప్పటికీ ఫైనల్ గా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సరైన రీతిలో జరగడం పట్ల అభిమానులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు ఫోర్ కె రీ రిలీజ్ ని టీజర్ లాంచ్ కి వేదికగా మార్చుకోవడం పెద్దాయన ఫ్యాన్స్ ని మరింత దగ్గర చేస్తోంది. ఈ ప్లానింగ్ వల్లే సాయంత్రం థియేటర్లు కిక్కిరిసిపోనున్నాయి. కృష్ణ గారి కల్ట్ క్లాసిక్ ని లక్షల సంఖ్యలో చూసే అవకాశం దీని ద్వారా కుదిరింది.
గుంటూరు కారం టైటిల్ ఆల్రెడీ లీక్ అయిపోయింది కాబట్టి దాని గురించి పెద్దగా సస్పెన్స్ ఏమీ లేదు. వీడియోలో మహేష్ బాబు మిర్చి యార్డులోకి రావడం, తువాలు తలపాగాలాగా చుట్టుకుని రౌడీలకు వార్నింగ్ ఇవ్వడం లాంటి షాట్స్ ని నిమిషం పాటు ఉండే టీజర్ లో రివీల్ చేయబోతున్నారు. ఇది ఓ రేంజ్ లో పేలడం ఖాయమని శ్రీమంతుడు నుంచి ఒకరకమైన సెటిల్డ్ హీరోయిజంకి పరిమితమైన మహేష్ లోని అసలు మాస్ ని త్రివిక్రమ్ మరోసారి పరిచయం చేయబోతున్నాడని టీజర్ ని చూసిన యూనిట్ మెంబర్స్ టాక్. అంచనాలు పెంచడానికి ఇంత కన్నా ఏం కావాలి.
విడుదల తేదీ జనవరి 12కి ఇంకా ఏడు నెలలకు పైగానే టైం ఉంది కాబట్టి ఇక అప్డేట్స్ కి స్వస్తి చెప్పి పూర్తిగా షూటింగ్ మీదే దృష్టి సారించబోతున్నారు. ఇప్పటిదాకా పూర్తయ్యింది ముప్పై శాతం లోపే. ఇంకా పాటలు మొదలుపెట్టాలి. తమన్ మొత్తం ట్యూన్స్ ఇచ్చినట్టు లేడు. విదేశీ పర్యటనలు ఎలాగూ పూర్తయ్యాయి కాబట్టి మహేష్ పూర్తి స్థాయిలో త్రివిక్రమ్ కు అందుబాటులో ఉంటాడు. ఎటొచ్చి గురూజీ స్పీడ్ పెంచాలి. పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న గుంటూరు కారంలో ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ తో పాటు బోలెడంత యాక్షన్ ఉంటుందట
This post was last modified on May 31, 2023 11:08 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…