క్రికెటర్ల బయోపిక్కులు ఇప్పటిదాకా చాలానే వచ్చాయి. ధోని. సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్, మిథాలీ రాజ్ తదితరుల కథలను తెరమీద చూసుకుని అభిమానులు మురిసిపోయారు.ఇప్పుడీ లిస్టులోకి సౌరవ్ గంగూలీ కూడా చేరబోతున్నాడు. ఇప్పటి యువతకు అంతగా అవగాహన ఉండకపోవచ్చు కానీ ఒకప్పుడు విరాట్ కోహ్లీ కన్నా అగ్రెసివ్ కెప్టెన్ గా ఎన్నో అద్భుత విజయాలు సొంతం చేసుకుని గొప్ప రికార్డులు సాధించాడు. ముఖ్యంగా లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ మీద చారిత్రాత్మక విజయం సాధించాక పైఅంతస్థు పెవిలియన్ నుంచి చొక్కా విప్పి ఎగరేయడం ఫాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు
అలాంటి గంగూలీ లైఫ్ ని స్క్రీన్ మీద చూడటం కన్నా అభిమానులు కోరుకునేది ఏముంటుంది. ముందుగా ఈ పాత్రను రన్బీర్ కపూర్ తో వేయిద్దామనుకున్నారు. కానీ ఇంకో మూడేళ్ళ వరకు డేట్లు ఖాళీ లేకపోవడం ఆ ప్రతిపాదన మానుకున్నారు. తాజాగా ఇప్పుడా ప్లేస్ లో ఆయుష్మాన్ ఖురానాని తీసుకోవడం దాదాపు ఖాయమేనని ముంబై టాక్. దర్శకత్వం కోసం రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను అడుగుతున్నారట. ఆవిడ ప్రస్తుతం క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే లాల్ సలాం తీస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి ఓ ప్రత్యేక క్యామియో చేస్తున్నారు. షూట్ అయిపొవచ్చింది
దాని అవుట్ ఫుట్ గురించి పాజిటివ్ రిపోర్ట్స్ రావడంతో గంగూలీ బాధ్యతలు ఐశ్వర్యకు ఇచ్చే దిశగా నిర్మాతలు చర్చలు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఆమె అంత ఆసక్తిగా లేరట. లాల్ సలాం రిలీజయ్యేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనని చెప్పినట్టు సమాచారం. ఆయుష్మాన్ స్వతహాగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మ్యాన్. ప్రాజెక్ట్ కనక కన్ఫర్మ్ అయితే ప్రత్యేకంగా ప్రాక్టీస్ కోసం మూడ్ నాలుగు నెలలు కేటాయించబోతున్నట్టు తెలిసింది. గల్లీ క్రికెట్ నుంచి బిసిసిఐ ప్రెసిడెంట్ దాకా ఎదిగిన గంగూలీ ప్రస్థానం ఖచ్చితంగా ఆడియన్స్ లో ఆసక్తి రేపేదే