జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు మంచి జోష్ ఇచ్చేందుకు ట్రిపుల్ ధమాకా సిద్ధమవుతోంది. అందులో మొదటిది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 108 టైటిల్ రివీల్. చిన్న వీడియోతో కూడిన టీజర్ ని సిద్ధం చేయబోతున్నారు. చాలా డిఫరెంట్ గెటప్ లో బాలయ్య కనిపించనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కామెడీ కన్నా కమర్షియల్ మసాలానే ఎక్కువ జొప్పించినట్టు ఇన్ సైడ్ టాక్. పటాస్ రేంజ్ మాస్, నిప్పురవ్వ క్లాస్ ని మిక్స్ చేసి అభిమానులకు చాలా స్పెషల్ గా చూపించబోతున్నారట. భగవంత్ కేసరి టైటిల్ తో ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ దాదాపు లాకైనట్టేనని టాక్
రెండో కానుక నరసింహనాయుడు రీరిలీజ్. 2001లో విడుదలైన ఈ ఇండస్ట్రీ హిట్ ని థియేటర్ లో అనుభూతి చెందని ఇప్పటి జనరేషన్ బోలెడున్నారు. బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యాక్షన్ డ్రామాకి మణిశర్మ ఇచ్చిన సంగీతంతో పాటు బాలయ్య అద్భుతమైన పెర్ఫార్మన్స్ సాధారణ ప్రేక్షకులను సైతం కట్టిపడేసింది. ఆ సంక్రాంతికి పోటీగా వచ్చిన మృగరాజు, దేవిపుత్రుడులను ఈజీగా ఓవర్ టేక్ చేసి నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. 7.1 డీటీఎస్ సౌండ్ కి అప్ గ్రేడ్ చేయడంతో పాటు ఫోర్ కె నాణ్యతతో నరసింహనాయుడు కొత్తగా దర్శనమివ్వబోతున్నాడు
ఇక మూడో ధమాకా భైరవ ద్వీపం. 1994లో సింగీతం శ్రీనివాసరావు గారు తీసిన ఈ జానపద క్లాసిక్ ఆ కాలానికి చెందిన బాహుబలని చెప్పాలి. మాస్ చిత్రాల తాకిడిలోనూ అద్భుత విజయం సాధించిన ఎవర్ గ్రీన్ మూవీ ఇది. టెక్నాలజీ లేని టైంలో సింగీతం వారు తెరకెక్కించిన ఈరు అబ్బురపరుస్తుంది. దీన్ని బిగ్ స్క్రీన్ మీద చూడటం మంచి ఎక్స్ పీరియన్స్ అవుతుంది. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కోసం వరసగా ఎంటర్ టైన్మెంట్ బొనాంజా ఇవ్వబోతున్నారు. అదే రోజు కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. పూరి, ప్రశాంత్ వర్మలు లిస్టులో ముందున్నారు.
This post was last modified on May 30, 2023 1:25 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…