మెగా స్టార్ చిరంజీవి ఎన్ని సినిమాలు చేసినా ‘అన్నయ్య’ , ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ ఫ్యాన్స్ కి ఎప్పటికీ స్పెషల్ మూవీస్ గా ఉంటాయి. ఈ చిత్రాల్లో చిరు పండించిన కామెడీ భారీ వసూళ్లు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా శంకర్ దాదా ఎంబిబిఎస్ లో చిరు కామెడీ టైమింగ్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ రీమేక్ సినిమాను థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేశారు.
ఇప్పుడు మెహర్ రమేష్ తో చిరు తెలుగులో ఓ రీమేక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ లో మళ్ళీ శంకర్ దాదా ఎంబిబిఎస్ తరహా కామెడీ టైమింగ్ తో అలరిస్తాడట చిరు. సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ మెయిన్ పాయింట్ అయినప్పటికీ మెగా స్టార్ తాలూకు సన్నివేశాలు , యాక్షన్ ఎపిసోడ్ ఫన్ క్రియేట్ చేసేలా ఉంటాయట.
చిరు తనకి గోల్డెన్ ఛాన్స్ ఇవ్వడంతో మెహర్ రమేష్ ఈ రీమేక్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. చిరంజీవిను మరింత స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఆయన కామెడీ టైమింగ్ తో ఫన్ సీన్స్ డిజైన్ చేసుకున్నాడు. సో మున్నా భాయ్ కి రీమేక్ గా వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో పండినట్లు ‘భోళా శంకర్’ లో చిరు కామెడీ టైమింగ్ తో వచ్చే సన్నివేశాలు వర్కవుట్ అయితే సినిమా సక్సెస్ సాదించినట్టే.
This post was last modified on May 29, 2023 11:58 pm
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…
వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది.…
తెరమీద చూసే సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు వాటి షూటింగుల్లో కూడా ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి. కెజిఎఫ్ తర్వాత మోస్ట్…
అసలే ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోతోంది ఏదో ఒకటి చేయమని అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు…
ఎంపీలకు తమ నియోజకవర్గం పరిధిలోని శాసన సభ స్థానాల పై పట్టు ఉండడం వేరు. ఎందుకంటే.. ఎంపీ లాడ్స్ నుంచి…