‘అ!’ అనే వెరైటీ సినిమాతో దర్శకుడిగా పరిచయమై ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా కమర్షియల్‌గా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా.. అతడికి అవకాశాలకేమీ లోటు లేదు. రెండో సినిమా ‘జాంబి రెడ్డి’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లే రాబట్ట ిహిట్ సినిమాగా నిలిచింది. దీంతో ప్రశాంత్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈసారి ‘హనుమాన్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా టీజర్ చూసి చాలామంది షాకయ్యారు. లిమిటెడ్ బడ్జెట్లోనే అతను చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ చర్చనీయాంశంగా మారింది. తెలుగులో అరుదుగా తెరకెక్కే సూపర్ హీరో జానర్ సినిమా కావడంతో దీని కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న ప్రశాంత్ వర్మ.. తన సంస్థ నుంచి ఇంకో ఎనిమిది సూపర్ హీరో సినిమాలు రాబోతున్నట్లు వెల్లడించడం విశేషం.
‘‘నాకు చిన్నప్పట్నుంచి సూపర్ హీరోలంటే చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ సినిమా చూసి నేను కూడా అలా అవ్వాలని ప్రయత్నించా. సాలె పురుగును పట్టుకుని తిరిగా. ఇంటర్నేషనల్ లెవెల్లో సూపర్ హీరో అనేది చాలా పెద్ద కమర్షియల్ జానర్. తెలుగులో అలా మనం ఎందుకు చేయకూడదనే ‘హనుమాన్’ను మొదలుపెట్టా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి.
ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కోసమే పది కోట్లు ఖర్చు పెడుతున్నాం. జులై తొలి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. రాబోయే పదేళ్లలో ఒక పెద్ద ఫ్రాంఛైజీ క్రియేట్ చేయడంపై మా టీం దృష్టిపెట్టింది. దాదాపు ఎనిమిది సూపర్ హీరో సినిమాలు తీసుకొస్తాం. వీటి కోసమే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ నెలకొల్పాం. సుమారు వందమందితో హాలీవుడ్ స్టూడియోలా దీన్ని నడపాలని అనుకుంటున్నాం’’ అని ప్రశాంత్ వివరించాడు.
This post was last modified on May 29, 2023 3:17 pm
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…
శ్రీకాంత్ ఓదెల.. ఈ పేరు చెప్పగానే అందరికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…
నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…
నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…