Movie News

నిఖిల్ చేస్తున్న కథతోనే ఇంకో సినిమా

టాలీవుడ్ యువ కథానాయకుడు నిఖిల్ నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోతున్నాడు. ఆల్రెడీ ‘కార్తికేయ-2’తో అతడి పేరు జాతీయ స్థాయిలో మార్మోగింది. త్వరలోనే విడుదలయ్యే ‘స్పై’ మూవీ కూడా అతడికి దేశవ్యాప్తంగా క్రేజ్‌ను పెంచేలా కనిపిస్తోంది. ఇప్పుడు అతను ‘ది ఇండియా హౌస్’ అంటూ మరో పక్కా పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు.

ఇది స్వాతంత్ర్య సమర యోధుడు వీర్ సావర్కర్ జీవితంతో ముడిపడ్డ కథ అని దీని టీజర్ చూస్తే అర్థమవుతోంది. స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఎప్పుడూ గాంధీ, నెహ్రూలనే గొప్ప స్వాతంత్ర్య సమర యోధులుగా చూపిస్తూ.. వల్లభాయ్ పటేల్, వీర్ సావర్కార్ లాంటి వాళ్లకు చరిత్రలో సరైన ప్రాధాన్యం దక్కుండా చేసిందనే వాదన చేస్తున్న బీజేపీ.. వీరికి వీర లెవెల్లో ఎలివేషన్ ఇస్తోంది ఈ మధ్య. ఈ క్రమంలోనే వీర్ సావర్కర్ మీద వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి.

నిఖిల్ ‘ది ఇండియా హౌస్’ను అనౌన్స్ చేసిన సమయంలోనే వీర్ సావర్కర్ జీవిత కథతో మరో సినిమాను అనౌన్స్ చేశారు. హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు.. ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’. ఇందులో లీడ్ రోల్ చేస్తున్నది బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా. విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు అతనే స్వయంగా దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. సావర్కర్ పాత్ర కోసం అతను బాడీ పెంచి సూపర్ ఫిట్‌గా తయారయ్యాడు. సావర్కర్‌ను గొప్ప యోధుడిగా చూపించేలా సినిమాను డిజైన్ చేశారని సావర్కర్ 140వ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది.

టీజర్ కూడా రిలీజైందంటే సినిమా షూట్ చాలా వరకు పూర్తయినట్లే. ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఐతే ఇప్పుడే చిత్రీకరణ మొదలుపెట్టుకుంటున్న ‘ది ఇండియా హౌస్’కు ఈ చిత్రం వల్ల ఇబ్బంది తప్పకపోవచ్చు. రణదీప్ చేస్తున్నది బయోపిక్ కాగా.. నిఖిల్ సినిమా సావర్కర్ జీవితంలో ఒక పార్ట్‌ ఆధారంగా తెరకెక్కనుంది. ఎలా అయినా సరే.. సావర్కర్ మీద ఒక సినిమా వచ్చాక నిఖిల్ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

This post was last modified on %s = human-readable time difference 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిధి అగర్వాల్ మూడు ప్యాన్ ఇండియా బ్లాస్టులు

హీరోయిన్లకు ఒక్కోసారి కెరీర్ లో స్పీడ్ బ్రేకర్ లాంటి దశ వస్తుంది. అప్పుడు ఎంత బ్లాక్ బస్టర్ సాధించినా అవకాశాలు…

1 min ago

బేబీతో భగత్ సింగ్ పోలికే అక్కర్లేదు

తమిళ స్టార్ విజయ్ తేరి తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ చేసినప్పుడు మన ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. మొదటిసారి థియేటర్లో చూసిన…

1 hour ago

గంభీర్‌కు ఆఖరి అవకాశం

గంభీర్ కోచ్ గా KKK జట్టుకు అందించిన విజయాలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. అతను ఏది చెబితే అది…

2 hours ago

మనకు నాని….వాళ్లకు శివకార్తికేయన్

కష్టపడితే అందలం ఎక్కించే టాలీవుడ్ పరిశ్రమలో దాన్ని సాధ్యం చేసుకునే వాళ్ళు కొందరే ఉంటారు. సరైన ప్లానింగ్ తో మంచి…

3 hours ago

డబుల్ ధమాకా ఇవ్వబోతున్న అనుష్క

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క దర్శనం జరిగి ఏడాదికి పైగానే అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్లలో స్వీటీ…

3 hours ago

పుష్ప వచ్చేవరకే కంగువకు గడువు

ఇంకో పది రోజుల్లో నవంబర్ 14 విడుదల కాబోతున్న కంగువ మీద ఎన్ని అంచనాలున్నాయో మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఏపీ, తెలంగాణలో…

4 hours ago