Movie News

సైంధవ్ లో షాకింగ్ నేపథ్యం

విక్టరీ వెంకటేష్ హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న సైంధవ్  షూటింగ్ సగానికి పైగానే పూర్తయిపోయింది. హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కీలక షెడ్యూల్స్ ఫినిష్ చేశారు. ఇప్పటికే కొంత భాగం నటించిన నవాజుద్దీన్ సిద్ధిక్ కి సంబంధించిన బ్యాలన్స్ ని జూలై నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో చాలా సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా బ్యాక్ డ్రాప్ కు సంబంధించి ఆసక్తికరమైన ఫ్యాన్స్ లో అంచనాలు పెంచుతున్నాయి.

వాటిలో ప్రధానమైంది సైంధవ్ లో బ్లాక్ మేజిక్ కీలక పాత్ర పోషిస్తోందట. ఒక అరుదైన మెడికల్ డ్రగ్ కాన్సెప్ట్ తో పాటు కర్ణాటక, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ వ్యావహారికంలో ఉన్న చేతుబడులతో కథకు చాలా కీలకంగా ముడిపెట్టారట. వీటితో పాటు శాస్త్రీయంగా అదెంత తప్పుడు నమ్మకమో చెబుతూనే బలమైన డాటర్ సెంటిమెంట్ ని పొందుపరిచినట్టు వినికిడి. హిట్ లో కేవలం మర్డర్లు వాటి ఇన్వెస్టిగేషన్ల చుట్టూ తిప్పిన శైలేష్ కొలను ఈసారి తన అసలైన టేకింగ్ టాలెంట్ ని ఇందులో ఆవిష్కరించబోతున్నట్టు సమాచారం. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలానే ఉంటాయట

ఈమధ్య విరూపాక్షలో ఇలాంటి నేపధ్యం ఆడియన్స్ ఆదరణ పొందింది. మరి సైంధవ్ కూడా అదే మేజిక్ రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఎఫ్3 సక్సెస్ తర్వాత వెంకటేష్ స్పెషల్ క్యామియో చేసిన ఓరి దేవుడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ ఓవర్ అడల్ట్ కంటెంట్ తో తెలుగు ఆడియన్స్ విమర్శలకు గురయ్యింది. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ సైంధవ్ మీదే ఉన్నాయి. అందులోనూ వెంకీ సీరియస్ సబ్జెక్టు చేసి ఏళ్ళు దాటిపోయింది. నారప్ప వచ్చింది కానీ అది యాక్షన్ జానర్ కాదు.  అందుకే సైంధవ్  మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి 

This post was last modified on May 29, 2023 1:29 pm

Share

Recent Posts

జూనియర్ విజయ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది

తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…

50 minutes ago

వెంకటేష్ చేసింది మంచి పనే

హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…

2 hours ago

యువతుల పిచ్చి… ఫోటోకి లక్ష రూపాయలా?

చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…

4 hours ago

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

6 hours ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

6 hours ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

7 hours ago