తగినంత సమయం లేకపోవడంతో ప్రమోషన్ల హడావిడి లేకుండా సైలెంట్ గా వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ 2018 తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. పోటీగా ఉన్న మేం ఫేమస్ పబ్లిసిటీ విషయంలో ఎన్నో అడుగులు ముందంజలో ఉండగా కంటెంట్ పరంగా 2018కే పబ్లిక్ సపోర్ట్ దక్కడంతో వసూళ్లు స్టడీగా పెరుగుతున్నాయి. రెండు రోజులకు మూడు కోట్లకు దగ్గరగా వెళ్లిన వసూళ్లు సోమవారానికి అయిదు కోట్లను టచ్ చేయడం ఖాయమే. అయితే కాంతార టైపులో స్లో పాయిజన్ లాగా భారీగా జనాన్ని థియేటర్లకు తీసుకొస్తుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు
వాస్తవ పరిస్థితి చూస్తే నగరాలూ పట్టణాల సంగతి పక్కనపెడితే బిసి సెంటర్స్ లో 2018 అంత దూకుడుగా లేదు. రివ్యూలు టాక్ లు చాలా పాజిటివ్ గా ఉన్నా సగటు మాస్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ అంశాలు లేకపోవడంతో చిన్న కేంద్రాల్లో పికప్ చాలా స్లోగా ఉంది. కాంతారకు ఇలా జరగలేదు. రెండో రోజే అనూహ్యంగా స్క్రీన్లను పెంచుకుంటూ పోయింది. ప్రేక్షకులు అమాంతం థియేటర్లకు వెళ్లిపోయారు. ఫలితంగా ఎవరూ ఊహించని విధంగా యాభై కోట్ల గ్రాస్ ని దాటేసి ఔరా అనిపించింది. గాడ్ ఫాదర్ లాంటి పోటీని తట్టుకుని మరీ గెలిచింది
2018 విషయంలో మాత్రం అంత స్పీడ్ లేదన్నది వాస్తవం. సూపర్ హిట్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు కానీ కాంతారను తాకడమో లేదా దాటడమో జరిగే పనిలా లేదు. సోమవారం నుంచి డ్రాప్ ఎంత శాతంలో ఉండబోతోందనేది కీలకంగా మారనుంది. హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో మాత్రం హౌస్ ఫుల్స్ బాగానే నమోదవుతున్నాయి. మొదటి రోజు కోటి, రెండో రోజు కోటి డెబ్భై లక్షలు, మూడో రోజు మరో రెండు కోట్ల పైచిలుకు వచ్చేస్తుంది. కానీ కాంతారాను ఏ కోణంలో చూసినా క్రాస్ చేయడం జరగని పనే. దీని సంగతి ఎలా ఉన్నా 2018 బెస్ట్ డబ్బింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోనుంది
This post was last modified on May 28, 2023 7:24 pm
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…