నిన్న రిలీజైన కొత్త సినిమాల్లో అందరి చూపు మేం ఫేమస్, 2018ల మీద ఉండటంతో మిగిలిన వాటి మీద ఆడియన్స్ దృష్టి అంతగా పోలేదు. వాటిలో మెన్ టూ కూడా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ సమర్పకుల్లో ఒకరిగా ఉండటం వల్ల థియేట్రికల్ గా ఇంత పోటీలోనో స్క్రీన్లు దొరికాయి. అయితే సరైన రీతిలో ప్రమోషన్లు చేయకపోవడంతో ఓపెనింగ్స్ రాలేదు. దాని తోడు ట్రైలర్ సైతం ఏదో స్పెషల్ కంటెంట్ ఉందనే అభిప్రాయం కలిగించలేదు. శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ని ఎవరూ పట్టించుకోలేదు సరే కానీ ఇంతకీ సినిమా ఎలా ఉంది
ఇది ప్రధానంగా నలుగురు మగాళ్ల చుట్టూ తిరిగే కథ. స్టాగ్స్ ఓన్లీ అనే పబ్ లో ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్ ఘంటసాల), మున్నా(మౌర్య సిద్ధవరం) రెగ్యులర్ గా కలుసుకుంటూ తమ జీవితంలో అమ్మాయిల వల్ల కలిగిన కష్టాలను పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ రాహుల్(వైవా హర్ష) పరిచయమవుతాడు. ఆఫీస్ లో ఫిమేల్ హరాస్మెంట్ బాధితుడు. ఇలా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో హఠాత్తుగా ఒక కుదుపు వస్తుంది. అదేంటి తమ సమస్యలను వీళ్లెలా పరిష్కరించుకుని లవర్స్ కి భార్యలకు బుద్ది చెప్పుకున్నారనేది అసలు సినిమాలో చూడాలి.
ఎఫ్2, సేవ్ ది టైగర్స్ తరహా నేపధ్యమే తీసుకున్న శ్రీకాంత్ జి రెడ్డి దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఫెయిలయ్యాడు. ఎక్కడా కూడా ఇంటరెస్టింగ్ అనిపించే సన్నివేశాలు, హాయిగా నవ్వుకునే కామెడీ ఏదీ లేకుండా కేవలం సీన్ల మీద ఆధారపడి అసలు కథను సరిగా రాసుకోలేదు. థియేటర్ కు వచ్చేంత కంటెంట్ కానీ క్యాస్టింగ్ ఇందులో లేదు. అలాంటప్పుడు ఫన్ మీద దృష్టి పెట్టి ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగితే కనీసం టార్గెట్ మగ భాధితులకైనా రీచ్ అయ్యేది. ఆ అవకాశాన్ని చేతులారా వృథా చేసుకున్నారు. ఓటిటిలోనే కష్టమనిపించే మెన్ టూకి సారీ చెప్పడం తప్ప ఏం చేయలేం
This post was last modified on May 27, 2023 7:45 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…