దసరా బ్లాక్ బస్టర్ తర్వాత మంచి ఊపుమీదున్న న్యాచురల్ స్టార్ నాని డెబ్యూ దర్శకుడు శౌర్యవ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కూతుళ్ళ పాప సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేసుకున్నారు. ఇది అయ్యాక నాని ఎవరితో చేస్తాడనే క్లారిటీ ఇంకా రాలేదు. లేటెస్ట్ లీక్ ప్రకారం మలయాళం దృశ్యం సృష్టించిన జీతూ జోసెఫ్ తనకో లైన్ వినిపించినట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే ఒక రౌండ్ డిస్కషన్ అయ్యిందని ఏం చేయాలో కంక్లూజన్ కు మాత్రం రాలేదట.
జీతూ జోసెఫ్ ప్రస్తుతం మోహన్ లాల్ తో రామ్ అనే రెండు భాగాల భారీ చిత్రం తీస్తున్నారు. ఇది కూడా థ్రిల్లరే. ఈ కాంబినేషన్ లో రూపొంది డైరెక్టర్ ఓటిటిలో రిలీజైన 12త్ మ్యాన్ ఆశించిన ఫలితం అందుకోలేదు. అందుకే దృశ్యం మేజిక్ మరోసారి రిపీట్ చేసే కసితో ఉన్నారు. ఇదిలా ఉండగా నానికి చెప్పిన స్టోరీ జీతూ జోసెఫ్ గత చిత్రం కూమన్ రీమేక్ గా మరో ప్రచారం వినిపిస్తోంది. ఇది గత నవంబర్ థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో మంచి క్రైమ్ సస్పెన్స్ గా పేరు తెచ్చుకుంది. ఇదే నానికి చెప్పి ఉండొచ్చట.
ఇదంతా అనఫీషియల్ న్యూస్ కాబట్టి కన్ఫర్మేషన్ వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే రామ్ ఫినిష్ చేశాక జీతూ జోసెఫ్ దృశ్యం 3 ప్లాన్ లో ఉన్నారు. ఒకేసారి మోహన్ లాల్, వెంకటేష్, అజయ్ దేవగన్, రవిచంద్రన్ లతో నాలుగు భాషల్లో ఏకకాలంలో తీసి ఒకేసారి రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. హై బడ్జెట్ కాదు కాబట్టి ఇదేమంత కష్టం కాదు కానీ డేట్లు కోఆర్డినేట్ చేసుకుని తెరకెక్కించడం కొంచెం కష్టమే. ఒకవేళ లేట్ అయ్యే పక్షంలో నానితో ఓ చిత్రం తెరకెక్కించాలని జీతూ ఆలోచన. నిజమైతే న్యాచుల్ స్టార్ కో క్రేజీ ప్రాజెక్ట్ దొరికినట్టే
This post was last modified on May 27, 2023 4:45 pm
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…
హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…
షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…
దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…
భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…
నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…