Movie News

తప్పు తారక్‌దే అని తేల్చేశారు

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ముగిసిపోయి వారం కావస్తోంది. కానీ ఆ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడంపై వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తారక్‌ను చాలా ఏళ్ల నుంచి అదే పనిగా నందమూరి, నారా కుటుంబాలు అవమానిస్తున్నాయని.. అతణ్ని తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయని.. ఈ వేడుకలకు రాకుండా తారక్ మంచి పని చేశాడని.. అయినా ఆల్రెడీ కుటుంబంతో విదేశాలకు వెళ్లే కమిట్మెంట్ ఉన్నవాడు ఈ వేడుకలకు ఎలా వస్తాడని  ఒక వర్గం అంటోంది.

ఐతే విజయవాడలో జరిగిన వేడుకలకు తారక్‌ను ఆహ్వానించలేదని విమర్శించిన వాళ్లు, ఇప్పుడు ఆహ్వానం అందినా హాజరు కాని తారక్‌ను ఎలా సమర్థిస్తారని.. ఎంతో ప్రత్యేకమైన తాత శత జయంతి వేడుకల కంటే పుట్టిన రోజు ట్రిప్ ముఖ్యమా అని మరో వర్గం వాదిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల నిర్వహణ కర్త టీడీ జనార్దన్.. ఈ విషయంలో తప్పంతా తారక్‌కే అన్నట్లుగా మాట్లాడారు.

ఎన్టీఆర్‌ను ఈ వేడుకలకు వ్యక్తిగతంగా వెళ్లి ఆహ్వానించింది జనార్దనే. అయినా తారక్ రాకపోవడంపై ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగితే.. వారం రోజుల తర్వాత కలిసే అవకాశం ఇచ్చినట్లు వెల్లడించారు. తాను విదేశాలకు వెళ్లాల్సి ఉన్నందున ఈ వేడుకలకు రాలేకపోతున్నానని అప్పుడే తారక్ చెప్పగా.. కానీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నయినా చేసుకోవచ్చని.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఒక్కసారే వస్తాయని.. ఇలాంటి అరుదైన సందర్భంలో జరిగే వేడుకలకు వస్తే బాగుంటుందని తాము చెప్పినట్లు జనార్దన్ వెల్లడించారు.

కానీ 22 కుటుంబాలు కలిసి విదేశీ పర్యటనకు వెళ్తున్నామని తారక్ చెప్పి.. తన నిర్ణయం తాను తీసుకున్నాడని జనార్దన్ తెలిపాడు. తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్‌ను కూడా తాము శత జయంతి వేడుకలకు ఆహ్వానించామని.. ఐతే ఆయన కూడా తారక్‌తో పాటే వెళ్లినట్లు ఉన్నారని.. అందుకే తను కూడా రాలేకపోయారనుకుంటున్నామని జనార్దన్ అన్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో తారక్‌దే తప్పని టీడీపీ తరఫున చెప్పినట్లయింది.

This post was last modified on May 27, 2023 4:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివాదాలెన్నున్నా.. ఇండస్ట్రీ హిట్టయింది

ఈ మధ్య కాలంలో ఇండియాలో పెద్ద వివాదానికి దారి తీసిన సినిమా అంటే.. ‘ఎల్‌2: ఎంపురాన్’ అనే చెప్పాలి. తమ…

3 hours ago

బ్రేకింగ్: జ‌మిలి ఎన్నికలు ఎప్పుడంటే…

దేశంలో `వ‌న్ నేష‌న్-వ‌న్ ఎల‌క్ష‌న్` పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్ల‌మెంటుకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని.. కేంద్రం త‌ల‌పోస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై…

4 hours ago

వర్మ శారీ…..ఆడియన్స్ సారీ

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలుగులోనే కాదు హిందీలోనూ పెద్ద బ్రాండ్. శివ నుంచి సర్కార్ దాకా ఎన్నో…

8 hours ago

ట్రోలింగ్‌పై స్పందించిన మోహన్ బాబు

టాలీవుడ్లో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదంటే.. మంచు వారి వైపే చూపిస్తారు ఎవరైనా. తమ మీద…

11 hours ago

విమర్శల సుడిలో మీనాక్షి… ఏం జరిగింది?

మీనాక్షి నటరాజన్… .పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా. నిజమే… ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా బాధ్యతలు…

11 hours ago

పీ-4కు స్పంద‌న‌.. 10 కోట్లు విరాళం

సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం పీ-4(ప‌బ్లిక్‌-ప్రైవేటు-పీపుల్స్‌-పార్ట‌న‌ర్‌షిప్‌)కు ఉన్న‌త స్థాయి వ‌ర్గాల నుంచి స్పంద‌న వ‌స్తోంది. స‌మాజంలోని పేద‌ల‌ను ఆదుకుని..…

11 hours ago