చెప్పా పెట్టకుండా పొన్నియిన్ సెల్వన్ 2 అమెజాన్ ప్రైమ్ లో నిన్న అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ మొదలయిపోయింది. అయితే ఎప్పటిలాగే ఇప్పుడూ ట్విస్టు ఇచ్చారు. మెంబెర్ షిప్ ఉన్నా సరే ఈ సినిమా చూడాలంటే అక్షరాలా 399 రూపాయలు చెల్లించాలి. కాకపోతే వంద రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వెనక్కు ఇస్తారు. అకౌంట్ లేకపోతే పూర్తిగా కట్టాలి. అది కూడా షో మొదలుపెట్టిన నలభై ఎనిమిది గంటల్లో పూర్తి చేయకపోతే లింక్ పని చేయదు. ఇంత ఖరీదు ఎందుకయ్యా అంటే రిలీజై కేవలం నెల రోజులే అయ్యింది కాబట్టి ఆ ప్రత్యేక సౌలభ్యం కోసం ఈ ధరన్న మాట
అన్ని భాషల్లోనూ పీఎస్ 2 అందుబాటులో ఉంచారు. తమిళం సంగతేమో కానీ తెలుగులో మాత్రం సెకండ్ పార్ట్ ఫ్లాప్ గానే మిగిలింది. అంచనాను అందుకోలేక బ్రేక్ ఈవెన్ కి దూరంగా నిలిచిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ 1కే మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపు థియేటర్ రన్ ముగింపుకొచ్చిన తరుణంలో ఇప్పుడీ ఓటిటి రిలీజ్ వల్ల వచ్చిన లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదు. కాకపోతే ఏ యాభై వంద కాకుండా ఇలా నాలుగేసి వందలంటే మాత్రం అన్యాయమే అంటున్నారు ఫ్యాన్స్. పైరసీ జడలు విరబోసుకున్న టైంలో ఇలా చేయడం వర్కౌట్ కాదు
నిజానికి అమెజాన్ ప్రైమ్ ఈ పే పర్ వ్యూ మోడల్ ని భారతీయ కస్టమర్లకు అలవాటు చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తోంది. హిందీ సినిమాలను సైతం ఇదే తరహాలో డబ్బులిచ్చి చూడమని ఎర్లీ ప్రీమియర్ల పేరుతో టెంప్ట్ చేస్తోంది. ఇటీవలే అజయ్ దేవగన్ భోళా ఇలాగే వస్తే పెద్దగా స్పందన లేకపోవడంతో నిన్నటి నుంచి జనరల్ స్ట్రీమింగ్ కి వదిలేశారు. అయిదారు నెలల క్రితం వచ్చిన హాలీవుడ్ మూవీస్ కి మాత్రం ప్రైమ్ ఇదే ధోరణి కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లో ప్రీమియమ్ కంటెంట్ కోసం ఖచ్చితంగా డబ్బులిచ్చే చూడాల్సిన పరిస్థితి తలెత్తడం ఖాయమే అనిపిస్తుంది
This post was last modified on May 26, 2023 10:05 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…