రేపు విడుదల కాబోతున్న మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్ పవిత్ర లోకేష్ జంట ఏం చేయబోతుందో తెరమీద చూడొచ్చు కానీ రియల్ లైఫ్ లో కూడా అలాంటి మ్యారేజెస్ జరిగిపోతున్నాయి. అరవై ఏళ్ళ ఆశిష్ విద్యార్ధి ఇవాళ రూపాలి బారువాని వివాహం చేసుకున్నాడు. ఆమె వయసు 33 సంవత్సరాలు. మొదటి భార్య రజోషి బారువా. నిన్నటి తరం నటి శకుంతల కూతురు. రూపాలి కోల్కతాలో పెద్ద ఫ్యాషన్ స్టోర్ నడుపుతూ స్వంతంగా వ్యాపారంలో ఎదుగుతోంది. ఈవిడ స్వస్థలం గౌహతి. కొన్నేళ్ల నుంచి సాగిన పరిచయం ఇవాళ మూడు ముళ్ల దాకా తెచ్చింది
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో మర్చిపోలేని గొప్ప పాత్రలు ఎన్నో వేసిన ఆశిష్ విద్యార్ధి అవకాశాలు తగ్గిపోయి బాలీవుడ్ కు పరిమితమయ్యాడు తెలిసిన అతికొద్ది మంది బంధు మిత్రుల మధ్య ఈ తతంగాన్ని నడిపించారు. పెళ్లి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఏజ్ ఎంతైనా సరే సినీ తారలు ఇలా మళ్ళీ పెళ్లి చేసుకున్నప్పుడు వాటి తాలూకు వార్తలు పట్ల జనానికి మంచి ఆసక్తి ఉంటుంది. ఇలాంటివి జరగడం కొత్తేమి కాదు. ఎన్టీఆర్, జెమిని గణేశన్ లాంటి దిగ్గజాలు సైతం ద్వితీయ వివాహాలు చేసుకున్న వాళ్ళే.
ఆశిష్ విద్యార్ధి మాత్రం మహా ఆనందంగా ఉన్నాడు. చాలా థ్రిల్లింగ్ గా ఉందని కొత్త జీవిత భాగస్వామితో లైఫ్ ని రంగులమయం చేసుకుంటానని చెబుతున్నారు. వీళ్ళ ప్రేమకథ చాలా పెద్దదేనట. సమయం వచ్చినప్పుడు డీటెయిల్డ్ గా చెబుతానని ఆశిష్ అంటున్నారు. పోకిరి, అతనొక్కడే, గుడుంబా శంకర్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్ లో ఫ్యాన్స్ మర్చిపోలేని క్యారెక్టర్లు చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్ త్వరలో రీ ఎంట్రీ ఇస్తా అంటున్నారు. ఇటీవలే వెంకటేష్ రానా నాయుడులో ఓ కీలక పాత్ర దక్కించుకుని మెప్పించారు. సీక్వెల్ లోనూ కనిపించబోతున్నారు
This post was last modified on May 25, 2023 8:45 pm
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…