Movie News

మహేష్ ఫ్యాన్స్ అసంతృప్తి అందుకే

మేం ఫేమస్ సినిమాకు మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా బ్రహ్మాండంగా ఉందంటూ సర్టిఫికెట్ ఇవ్వడం ఫ్యాన్స్ కి అంతగా మింగుడు పడటం లేదు. అది బ్లాక్ బస్టర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ తేడా కొడితే మాత్రం తొందపడి ఒక కోయిల ముందే కూసింది సామెతను యాంటీ ఫ్యాన్స్ వాడతారని వాళ్ళ ఆందోళన. ఇంకొద్ది గంటలు ఆగితే షోలు పడిపోతున్న సినిమాకు మహేష్ తో ఆఘమేఘాల మీద షో చూపించి ట్వీట్ వేయించడానికి కారణం అడ్వాన్స్ బుకింగ్స్ మరీ చప్పగా ఉండటమే. ప్రీమియర్లకు పర్వాలేదు కానీ రేపు మాత్రం నీరసం వచ్చేలా ఆన్ లైన్ సేల్స్ ఉన్నాయి

నిర్మాతలు ఛాయ్ బిస్కెట్ టీమ్ కాబట్టి వాళ్లకు ముందు నుంచి మహేష్ బాబుతో అనుబంధం ఉంది. కలిసి మేజర్ లాంటి ప్యాన్ ఇండియా ప్రాజెక్టు చేశారు. సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచే సూపర్ స్టార్ తో రెగ్యులర్ టచ్ లో ఉన్నట్టు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకోవడం చూశాం. అది వాడుకునే మేం ఫేమస్ కి సపోర్ట్ అడగటం ఆయన నో అనకుండా ఎస్ చెప్పడం జరిగిపోయాయి. అంతే కాదు హీరో దర్శకుడు సుమంత్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కూడా మేమే చేయబోతున్నామని జిఎంబి బ్యానర్ జట్టు కడితే బాగుంటుందని అడగటం మహేష్ ఓకే అనడం ఫాస్ట్ గా జరిగిన పరిణామాలు

సరే మంచి సినిమాను ప్రోత్సహించడంలో తప్పు లేదు కానీ కేవలం స్నేహం ఉంధనే కారణంతో ఇలా రిలీజ్ కు ముందు ఇంత పొగడటం ఏమిటని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ టైటిల్ కి డిజాస్టర్ అనే పదం జోడించి ట్వీట్లు ట్రోల్స్ చేస్తున్నారు. సో మేం ఫేమస్ హిట్ అయితేనే వీళ్ళు కూల్ అవుతారు. బ్యాండ్లు పెట్టి సెలబ్రిటీలతో ప్రాసలు చెప్పించడం తప్ప కంటెంట్ ని ఎక్కువగా ఎలివేట్ చేసుకోలేదు మేం ఫేమస్ టీమ్. ఈ స్థాయిలో మద్దతు ఈ మధ్య కాలంలో ఎవరికీ దక్కలేదు. పబ్లిసిటీ ఘనంగా ఉంది మరి కంటెంట్ ఏం చేస్తుందో లెట్ వెయిట్ అండ్ సీ.

This post was last modified on May 25, 2023 4:24 pm

Share

Recent Posts

లిక్క‌ర్ కేసు… జ‌గ‌న్ అరెస్టుకు రంగం సిద్ధమేనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ అరెస్టు ఎంతో దూరంలో లేదా? ఈ ఏడాదే ఆయ‌న‌ను అరెస్టు చేయొచ్చా.? అది త‌ప్పితే.. ఆయ‌న…

40 minutes ago

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

2 hours ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

2 hours ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

6 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

6 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

6 hours ago