అల వైకుంఠపురములో.. టాలీవుడ్ చరిత్రలోనే ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో ఈ సినిమా ఒకటి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ చిత్రం ఓ మోస్తరు అంచనాలతోనే విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. చూడ్డానికి మామూలు సినిమాగా అనిపిస్తూనే.. చాలా ప్లెజెంట్‌గా సాగుతూ.. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందీ చిత్రం.
సినిమాలో వినోదానికి తోడు అదిరిపోయే పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టీంలో ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. ప్రేక్షకులు కూడా అందుకు తగ్గ ఫలితాన్నే అందించారు. ఈ సినిమాకు పని చేసిన మెయిన్ కాస్ట్ అండ్ క్రూ కలిసి మళ్లీ ఓ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్‌తో బన్నీ మరో సినిమా చేస్తాడని ముందు నుంచే సంకేతాలు వస్తున్నాయి.
ఇటీవలే వీళ్లిద్దరూ ఒక కథ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బన్నీ, త్రివిక్రమ్ కలిసి గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చేసినప్పటికీ.. వీరి కలయిక అనగానే ఇప్పుడు ‘అల..’నే గుర్తుకు వస్తోంది. దీంతో ప్రేక్షకులు సరిగ్గా అలాంటి సినిమానే కోరుకుంటారు.
ఈ నేపథ్యంలోనే గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు మరోసారి చేతులు కలుపుతున్నాయి. ఆటోమేటిగ్గా తమనే ఈ చిత్రానికి సంగీతం కూడా అందిస్తాడని భావించవచ్చు. మరి కథానాయికగా పూజా హెగ్డేనే కొనసాగుతుందా లేదా అన్నదే చూడాలి. త్రివిక్రమ్ వరుసగా మూడు చిత్రాల్లో ఆమెకు అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు రూపొందిస్తున్న చిత్రంలో పూజానే కథానాయిక అన్నది తెలిసిందే. ‘పుష్ప-2’ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను బన్నీ పట్టాలెక్కిస్తాడు.
This post was last modified on May 25, 2023 6:44 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…