Movie News

ముదిరిపోతున్న రీరిలీజుల పంచాయితీ

ట్రెండ్ పేరుతో రీ రిలీజులను అభిమానులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో వీటి కలెక్షన్ల మీద జరుగుతున్న పంచాయితీ సోషల్ మీడియా వేదికగా తీవ్ర రూపం దాలుస్తోంది. శనివారం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా పునఃవిడుదలైన సింహాద్రి మొదటి రోజే అయిదు కోట్ల గ్రాస్ వసూలు చేసిందన్న వార్త యాంటీ ఫ్యాన్స్ కు టార్గెట్ అయిపోయింది. ఖుషి, పోకిరి రికార్డులను బ్రేక్ చేసిందని పలు ట్వీట్లు హల్చల్ చేయగా అదేమీ లేదంటూ మహేష్ పవన్ అభిమానులు వాటికి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. పరస్పరం కవ్వించుకుంటూ రెచ్చగొట్టుకునే దాకా వెళ్లారు.

నిజానికి ఈ పాత చిత్రాల రీరిలీజుల సంబరం రెండు మూడు రోజులకు పరిమితం అంతే. ఇప్పటిదాకా ఈ క్యాటగిరీలో వచ్చిన అన్ని సినిమాలు యూట్యూబ్ లో ఫ్రీగా దొరుతున్నవే. అయినా సరే థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం ఆడియన్స్ వీటిని చూస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్లు వరసగా దింపుతున్నారు. తారక్ బర్త్ డే కలిసి రావడంతో పాటు రాజమౌళి కాంబో కాబట్టి సింహాద్రికి గ్రాండ్ సెలెబ్రేషన్లు చేశారు. సీడెడ్ తో సహా పలు కీలక కేంద్రాల్లో నిజంగానే రికార్డులు నమోదయ్యాయి. కొత్త మూవీస్ అయితే నిర్మాత అధికారికంగా ప్రకటిస్తాడు కానీ వీటికా అవకాశం లేదు.

రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ప్రెస్టీజియస్ గా తీసుకుని గుడుంబా శంకర్, అతడు లాంటి వాటికి రెట్టింపు రచ్చ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. అయినా వీటి వల్ల లక్షల రూపాయల ఖర్చు పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఈ ట్రెండ్ మొదలై ఏడెనిమిది నెలలు దాటేసింది. ఎక్కడో ఒక చోట బ్రేక్ వేయకపోతే ట్విట్టర్ లో ఇన్స్ టాలో ఈ గొడవలు ఇంకో రూపం దాల్చే ప్రమాదం లేకపోలేదు. అత్యుత్సాహం వల్ల కొన్ని థియేటర్లలో ఆస్తి నష్టం జరిగింది. ఇకనైనా రీరిలీజులను కేవలం అనుభూతి చెందేందుకు మాత్రమే వాడుకుంటే మంచిది.

This post was last modified on May 22, 2023 6:49 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

3 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

4 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

5 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

6 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

6 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

7 hours ago