స్వాతిముత్యంతో తెరకు పరిచయమైన బెల్లంకొండ గణేష్ రెండో సినిమా నేను స్టూడెంట్ సర్ జూన్ 2 విడుదలకు రెడీ అవుతోంది. సాయి శ్రీనివాస్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏదో కొత్తగా ట్రై చేసే ఉద్దేశంతో కథలను బాగానే ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. డెబ్యూ మూవీకి కంటెంట్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అందుకే ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన నేను స్టూడెంట్ సర్ సరైన టైమింగ్ చూసుకుని వస్తోంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
సుబ్బు(బెల్లంకొండ గణేష్) కాలేజీ స్టూడెంట్. పైసా పైసా కూడబెట్టుకుని వాయిదాల పద్ధతిలో కొత్త ఐఫోన్ కొంటాడు. దీని మీద ఎంత ప్రేమంటే తల్లికి ఓ బిడ్డలా పరిచయం చేసి ఓ పేరు పెట్టమని అడుగుతాడు. అంతా బాగుందనుకుంటున్న టైంలో ఆ ఫోన్ లో ఒక వీడియో వల్ల సుబ్బు మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. కోటి రూపాయలకు పైగా డబ్బు సుబ్బు అకౌంట్ లో వచ్చి పడుతుంది. దీంతో హత్యానేరం మీద అతన్ని టార్గెట్ చేస్తాడు పోలీస్ కమీషనర్(సముతిరఖని). అయితే అమాయకుడైన సుబ్బుని కాపాడేందుకు విద్యార్ధి లోకం రంగంలోకి దిగుతుంది.
దర్శకుడు రాఖి ఉప్పలపాటి తీసుకున్న పాయింట్ కొంచెం కొత్తగానే అనిపిస్తోంది. సరైన రీతీలో లాజిక్స్ ని ప్రెజెంట్ చేయగలిగితే మంచి థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ అవుతుంది. విజువల్స్ గట్రా మాస్ కి రీచ్ అయ్యేలా తీసుకున్న శ్రద్ధ కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. అవంతిక దస్సని హీరోయిన్. కాన్సెప్ట్ ఎంత వెరైటీగా ఉన్నా చూపించే విధానం ఏ మాత్రం అటుఇటు అయినా ఫలితం తేడా కొడుతోంది. మరి నేను స్టూడెంట్ సర్ ఈ బలహీనత లేకుండా గట్టెక్కగలిగితే కుర్రాడికి మంచి హిట్ పడుతుంది. జూన్ 2 చిన్న సినిమాల పోటీ మధ్గ్య గణేష్ తన లక్కు పరీక్షించుకోబోతున్నాడు.
This post was last modified on May 22, 2023 6:45 am
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…