టాలీవుడ్లో కొందరు నటీనటులు తెర మీదే కాదు.. బయట కూడా అదిరిపోయే రేంజిలో కామెడీ టైమింగ్‌తో.. కెమిస్ట్రీతో ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి కామెడీ టైమింగ్ ఉన్న వాడే వెన్నెల కిషోర్. అతడికి మంచు విష్ణుతో భలేగా టైమింగ్ కుదురుతూ ఉంటుంది. ‘దేనికైనా రెఢీ’ సహా కొన్ని చిత్రాల్లో వీరి కలయికలో కామెడీ బాగా పండింది. బయట కూడా ఒకరి మీద ఒకరు బాగా పంచులు వేసుకుంటూ ఉంటారు. కిషోర్‌ను సోషల్ మీడియాలో గిల్లుతూ ఉండటం విష్ణుకు అలవాటు.
ఒక సినిమా వేడుకలో మాట్లాడుతూ.. కిషోర్‌కు బాగా పొగరని, తనను అదే పనిగా వెటకారాలు ఆడుతుంటాడని విష్ణు చెప్పడం.. దీనికి కిషోర్ సరదగా స్పందించడం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కిషోర్‌ను మరోసారి సోషల్ మీడియా వేదికగా సరదాగా టార్గెట్ చేశాడు విష్ణు. సంచలనం రేపుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం 2 వేల నోట్లు రద్దు విషయమై కిషోర్ మీద జోక్ పేల్చాడు విష్ణు.
రెండు వేల నోట్ల రూపాయలు కుప్పలుగా పోసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నేను శ్రీ వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినపుడు తీసిన ఫొటో. ఈ నోట్లతో ఆయన ఏం చేసుకుంటాడో అర్థం కావట్లేదు’’ అని విష్ణు ట్వీట్ వేశాడు. దీనికి కిషోర్ వెంటనే ఏమీ బదులు ఇవ్వలేదు. అతని టైమింగ్ తెలిసిందే కాబట్టి విష్ణుకు కౌంటర్ ఇవ్వకుండా ఉండకపోవచ్చు. నువ్వు దాచమని నాకిచ్చిందే కదా ఇదంతా అని కూడా అనొచ్చు.
2016లో పెద్ద నోట్ల రద్దు చేసినపుడు బ్లాక్ మనీని భారీగా దాచిన వాళ్లు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 2 వేల నోట్ల రద్దుతోనూ అలా నల్ల డబ్బు దాచిన వారికి ఇబ్బంది తప్పకపోవచ్చు. కొంత మొత్తం వరకైతే ఎక్స్‌ఛేంజ్ పెద్ద కష్టం కాదు. కానీ భారీ మొత్తంలో బ్లాక్ మనీని దాస్తే మాత్రం చాలా కష్టమే అవుతుంది. ముఖ్యంగా వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికల కోసం డబ్బు దాచిన ప్రతిపక్షాల పరిస్థితి అయోమయమే. వాళ్లను టార్గెట్ చేసే మోడీ సర్కారు ఇలా 2 వేల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని భావిస్తున్నారు.
This post was last modified on May 20, 2023 10:04 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…