అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ 30 టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. గత మూడు రోజుల నుంచి ప్రచారంలో ఉన్నట్టే దేవరను లాక్ చేశారు. తారక్ కు సంబంధించిన లుక్ ని పూర్తిగా రివీల్ చేశారు. సముద్రపు అలలు ఎగసి పడుతుండగా రాళ్ళ గుట్టలపై నిలుచుని చేతిలో బల్లెంతో చుట్టూ తాను తెగనరికిన దుర్మార్గుల శవాలతో జూనియర్ గెటప్ చాలా ఇంటెన్స్ గా ఉంది. రొటీన్ మాస్ టైపులో కాకుండా నల్లని చొక్కా పంచెతో దర్శనం ఇవ్వడం ఎవరూ ఊహించనిది.
అంటే ఇందులో సగటు కమర్షియల్ జానర్ లో ఉండే రెగ్యులర్ ట్రీట్ మెంట్ అయితే కాదన్న మాట. కళ్ళలో సముద్రమంత ఆవేశాన్ని నింపుకున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్న చూపు ఫ్యాన్స్ లో అంచనాలు ఎటో తీసుకెళ్లేలా ఉంది. బ్యాక్ డ్రాప్ గురించి చిన్న క్లూ తప్ప ఎలాంటి సమాచారం బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న కొరటాల శివ తన మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉందో గుర్తించే ఫస్ట్ లుక్ డిజైన్ ని ఇలా చేయించినట్టు స్పష్టమవుతోంది. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాబట్టి తారక్ ని సోలోగా స్క్రీన్ మీద చూసుకోవాలని ఫ్యాన్స్ నాలుగేళ్లుగా వెయిట్ చేస్తున్నారు.
అరవింద సమేత వీర రాఘవ వచ్చి చాలా కాలమైన నేపథ్యంలో ఎదురుచూపులు మాములుగా లేవు. దానికి తగ్గట్టే ఉన్న ఈ పోస్టర్ మొత్తానికి హైప్ ని అమాంతం పెంచేసింది. తనకు మాత్రమే సూటయ్యే హై వోల్టేజ్ క్యారెక్టర్ ఏదో కొరటాల శివ బలంగా సెట్ చేశారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో తనతో పాటు జాన్వీ కపూర్ హీరోయిన్ గా డెబ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక కీలక షెడ్యూల్ లో ఇద్దరూ పాల్గొన్నారు. 2024 ఏప్రిల్ 5 విడుదల కాబోతున్న దేవర ఫైనల్ గా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు మంచి కానుకే ఇచ్చింది
This post was last modified on May 19, 2023 8:00 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…