నిన్న విడుదలైన హాలీవుడ్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పదో భాగం ఫాస్ట్ ఎక్స్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇండియాలో రెండు నెలల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ పెట్టడం చూస్తే క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి రోజు దేశవ్యాప్తంగా సుమారు 70 వేలకు పైగా మల్టీప్లెక్సు టికెట్లు అమ్ముడుపోవడాన్ని బట్టి ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో స్పష్టమవుతోంది.
పైగా త్రీడి వెర్షన్ కావడంతో అభిమానులు మంచి ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. అయితే రివ్యూలు రిపోర్ట్స్ అంత ఆశాజనకంగా లేకపోవడం అసలు ట్విస్టు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా బ్రతుకుతున్న డొమినిక్ టోరెట్టో(విన్ డీజిల్)కు ఏజెన్సీ నుంచి మెసేజ్ వస్తుంది. ఒక మిషన్ కు హాజరు కమ్మని ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే తను వెళ్లకుండా రోమన్(టైరీస్ గిబ్సన్)బృందాన్ని దానికోసం పంపిస్తాడు. కానీ ఇది శత్రువులు తనను లక్ష్యంగా చేసుకున్న ట్రాప్ అని అర్థమవుతుంది.
దీంతో టీమ్ తో పాటు ఫ్యామిలీను కాపాడుకునే బాధ్యత డొమినిక్ మీద పడుతుంది. అదెలా చేశాడనేదే కథ. ఆద్యంతం యాక్షన్ విజువల్స్ తో నింపేసిన దర్శకుడు లూయిస్ లెటెరియర్ గ్రావిటీ సైతం ఆశ్చర్యపోయేలా నమ్మశక్యం కానీ ఫైట్లు ఛేజులతో నింపేశాడు. ఇంతకు ముందు భాగాలు ఫాలో అయినవాళ్లకు మాత్రమే ఫాస్ట్ ఎక్స్ లో అసలు ట్విస్టులు అర్థమవుతాయి.
లైన్ చిన్నదే. విలన్ హీరో మీద పన్నిన రివెంజ్ డ్రామా అంతే. సాగతీత, అవసరం లేని సీన్లు, హోరెత్తించే బిజిఎం ఇబ్బంది పెడతాయి. ఈ సిరీస్ వీరాభిమానులకు ఓ మోస్తరుగా నచ్చవచ్చేమో కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం చివరి నలభై నిముషాలు మినహాయించి అధిక శాతం బోర్ కొట్టేస్తుంది. టెక్నికల్ గా ఫాస్ట్ ఎక్స్ ఒక అద్భుతం. కానీ సినిమాటిక్ గా మాత్రం జస్ట్ యావరేజ్ మూవీ. ఆక్వామెన్ హీరో జాసన్ మోమోయ్ విలనిజం ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
This post was last modified on May 19, 2023 10:23 am
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…