తెలుగు సినిమా అంటే కొన్ని అనధికారిక నియమ నిబంధనలుంటాయి. హీరో అందగాడై ఉండాలి. తెల్లగా.. లేదా కనీసం ఛామన ఛాయతో ఉండాలి. ఒడ్డూ పొడవూ బాగుండాలి. బాడీ షేప్ అదీ ఓ రేంజిలో ఉండాలి. ఇలా ఉంటేనే హీరో. ఇండస్ట్రీనే కాదు.. ప్రేక్షకులు కూడా హీరో ఇలా ఉంటేనే ఆమోదిస్తారు. కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సర్జరీలు అవీ చేసి అయినా ఒక రూపు తెచ్చే ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప లుక్స్ విషయంలో తేడా ఉంటే మాత్రం హీరోగా అంగీకరించే పరిస్థితే ఉండదు. అలా కనిపించే వాళ్లను కామెడీ రోల్స్‌కు పరిమితం చేసి పడేస్తారు.
మన హీరోల పాత్రలు మామూలుగానే లార్జన్ దన్ లైఫ్ తరహాలో ఉంటాయి కాబట్టి.. హీరోల లుక్స్ విషయంలోనూ ఇలాగే ఆలోచిస్తారు. పాత్రలు సామాన్యంగా ఉంటే.. హీరోల లుక్స్ సాధారణంగా ఉన్నా కూడా చెల్లుబాటు అవుతుంది. కానీ ఇలాంటి ‘సాధారణమైన’ కథల పట్ల మన వాళ్లకు ఆసక్తి తక్కువ. కానీ తమిళంలో అలా కాదు. అక్కడి కథల్లాగే హీరోలు కూడా అత్యంత సామాన్యంగా ఉంటారు. మనవాళ్లు కమెడియన్‌గా కూడా అంగీకరించని యోగి బాబు లాంటి వాణ్ని హీరోగా పెట్టి పెట్టి వరుసగా అక్కడ సినిమాలు తీస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో తెలుగు సినిమా ఎంతో మారింది. ఇమేజ్ ఉన్న వాడే హీరో అనుకోకుండా.. లుక్స్ గురించి కూడా ఆలోచించకుండా కంటెంట్ ఉంటే సినిమాను ఆదరించే రోజులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన ఫిలిం మేకర్స్ ఆలోచనలు కూడా మారుతున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పరిచయమై కామెడీ రోల్స్ చేస్తూ పత్తా చాటుకుంటున్న యువ నటుడు సుహాస్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం ‘కలర్ ఫొటో’ టీజర్ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సుహాస్ చేసిన కొన్ని పాత్రలతోనే మంచి నటుడిగా గుర్తింపు సంపాదించాడు. తన లుక్స్ ప్రకారం చూస్తే హీరోగా పెట్టి సినిమా తీయడం ఆశ్చర్యమే.
కొన్నేళ్ల ముందు టాలీవుడ్లో ఇలాంటి సినిమాను ఊహించే వాళ్లం కాదు. కానీ అతడి మిత్రుడు సందీప్ రాజ్, ‘హృదయ కాలేయం’ దర్శక నిర్మాత సాయి రాజేష్ కలిసి సాహసం చేశారు. హీరో లుక్స్‌కు అనుగుణంగానే అతడి పాత్రనూ తీర్చిదిద్దారు. అతడి పాత్రతో పాటు టీజర్ జనాలను ఆకట్టుకుంటోంది. టీజర్ చూస్తే సినిమా హిట్టవడం గ్యారెంటీ అనిపిస్తోంది. మామూలుగా కమెడియన్లు హీరోలంటే అది కామెడీ సినిమాలాగే ఉంటుంది. కానీ ఇది సీరియస్ లవ్ స్టోరీ. ఫీల్‌తో పాటు ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఇది కనుక అంచనాలకు తగ్గట్లు ఉండి ప్రేక్షకాదరణ పొందితే ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశముంది. ఇలాంటి ‘సాధారణ’ హీరోలు, కథలు మరిన్ని తెర మీద చూడొచ్చన్నమాటే.
This post was last modified on August 6, 2020 11:57 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…