కొన్ని రీమేక్ విశేషాలు మహా విచిత్రంగా ఉంటాయి. 2016లో వచ్చిన విజయ్ తేరి ముచ్చట్లు చూస్తే అదే అనిపిస్తుంది. ఇది ఆ టైంలోనే తెలుగులో పోలీసోడుగా డబ్బింగ్ జరుపుకుని దిల్ రాజు ద్వారా రిలీజై పెద్దగా ఆడలేదు . ప్రైమ్ లో శాటిలైట్ ఛానల్ లో వచ్చాక చాలా మంది చూశారు. అయినా ఈ కథ విపరీతంగా నచ్చిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒరిజినల్ వెర్షన్ తో వీలైనంత పోలికలు రాకుండా దర్శకుడు హరీష్ శంకర్ దీన్ని తీర్చిదిద్దుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇటీవలే వచ్చిన చిన్న టీజర్ భారీ స్పందన దక్కించుకుంది. ఇప్పుడీ తేరినే హిందీలో వరుణ్ ధావన్ తో చేయబోతున్నారు. ఆట్లీనే దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ జవాన్ ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆట్లీ అది పూర్తి కాగానే బాలీవుడ్ తేరిని మొదలుపెడతాడట. ఇందుకుగాను భారీ రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు ముంబై మీడియా న్యూస్.
అయినా మళ్ళీ అదే కథని ఎందుకు తీయాలనే సందేహం వస్తోంది కదూ. అంత పెద్ద స్టార్ పవన్ చేయడానికి సిద్ధపడినప్పుడు వరుణ్ లాంటి మీడియం హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎందుకు వెనుకాడతారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అసలు ఈ తేరినే ఓ పాత మూవీకి ఫ్రీ మేక్. 1990లో విజయ్ కాంత్ క్షత్రియుడు వచ్చింది.
ఫ్లాష్ బ్యాక్ లో భార్య రేవతిని విలన్ చంపేస్తే పోలీస్ ఉద్యోగం వదిలేసి అజ్ఞాతంలో గడుపుతున్న హీరో దగ్గరకు భానుప్రియ వస్తుంది. జైల్లో ఉన్న ప్రతినాయకుడు బయటికి వచ్చి మళ్ళీ విజయ్ కాంత్ ని రెచ్చగొడతాడు. దీనికి కథను అందించింది మణిరత్నం. ఆట్లీ ఈ మెయిన్ పాయింట్ ని తీసుకునే తేరి రాసుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడది అన్ని భాషల్లోనూ రీమేక్ చేసే స్థాయికి చేరుకుంది. హిందీలో మార్పులు చేయడం కన్నా కలర్ జిరాక్స్ వైపే ఆట్లీ మొగ్గు చూపిస్తున్నాడని వినికిడి.
This post was last modified on May 16, 2023 4:31 pm
అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో దేశానికి స్వర్ణ యుగం తీసుకువస్తానని ప్రకటిం చారు.…
కెజిఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ కి చెట్టు కష్టాలు ఎక్కువయ్యాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. అదెలాగో…
ముఖ్యమంత్రిగా అనుభవంతో పాటు.. ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలా నడిపించాలన్న దాని గురించి ఎవరికైనా సలహాలు.. సూచనలు ఇవ్వొచ్చు కానీ నారా…
ఉత్సాహం మంచిదే కానీ సమయం.. సందర్భం చూసుకోవాలి. అదేమీ లేకుండా కూటమి సర్కారుకు ఉన్న సున్నిత అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా…
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజామున ఆదాయపన్ను శాఖ సోదాలు మొదలయ్యాయి. బడా నిర్మాతగానే…
అమెరికాలో అధ్యక్ష మార్పును ఆ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తనకు అనుకూలంగా మార్చుకునే దిశగా తెలివిగా అడుగులు…