ఈ గురువారం విడుదల కాబోతున్న అన్నీ మంచి శకునములే ఓపెనింగ్స్ తోనే అద్భుతాలు చేస్తుందని నిర్మాణ సంస్థ స్వప్న సినిమా అత్యాశలో లేదు. టాక్ బాగా వచ్చి క్రమంగా ఆడియన్స్ పెరిగి బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. సంతోష్ శోభన్ వరస ఫ్లాపుల్లో ఉండటం వల్ల బజ్ పరంగా ఆశించిన స్థాయిలో అంచనాలు లేవు కానీ ఇలాంటి ఫ్యామిలీ మూవీస్ పికప్ అయ్యేది రెండు మూడు రోజుల నుంచే. ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ లైన్ అప్పుడెప్పుడో వచ్చిన సిద్దార్థ్ బావ నుంచి తీసుకున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.
దానికి ఆధారంగా చెబుతున్న పాయింట్ ఒకటే. రెండు కుటుంబాలు విడిపోతే వాళ్ళను కలిపేందుకు వరసకు బావ మరదళ్లయిన హీరో హీరోయిన్లు పూనుకోవడం. బావ పూర్తిగా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో జరిగితే అన్నీ మంచి శకునములేని హిల్ స్టేషన్ సెటప్ కి మార్చారు. కేవలం ఈ ఒక్క సారూప్యత ఆధారంగా రెండింటికి పోలిక ఆపాదించడం కామెడీనే అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాక్ డ్రాప్ లో చాలా తెలుగు సినిమాలొచ్చాయి. వెంకటేష్ కలిసుందాం రా కన్నా మంచి ఉదాహరణ అక్కరలేదు. పెద్దరికం, నువ్వు లేక నేను లేను చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది
పోలికలు ఉన్నా లేకపోయినా ఆడియన్స్ కోరుకున్న ఎంటర్ టైన్మెంట్ ఇస్తే చాలు ఆటోమేటిక్ గా హిట్టయ్యే ట్రెండ్ లో దర్శకురాలు నందిని రెడ్డి పూర్తిగా వినోదాన్ని ఎమోషన్లను నమ్ముకున్నారు. ఎలాగూ బాక్సాఫీస్ డల్ గా ఉంది. సరైన సినిమా లేక థియేటర్లకు వెళ్లాల్సిన కుటుంబాలు పార్కులు రెస్టారెంట్లు తిరుగుతూ టైం పాస్ చేస్తున్నారు. ఈ టైంలో చూడొచ్చనే మాట వచ్చినా చాలు అన్నీ మంచి శకునములేకు జరిగిన బిజినెస్ కి ఈజీగా టార్గెట్ దాటేస్తుంది. సీతారామన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మూవీ కావడంతో వైజయంతీ టీమ్ దీని మీద గట్టి నమ్మకంతో ఉంది
This post was last modified on May 16, 2023 1:57 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…