దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ హిందీ బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడిస్తోంది. కేవలం వారం రోజులకే 81 కోట్లు రాబట్టి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా ఉన్న గంగూబాయ్ కటియావాడిని దాటేందుకు సిద్ధమవుతోంది. ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో లేట్ నైట్ పదకొండు పన్నెండు గంటలకు వేసిన షోలు కూడా హౌస్ ఫుల్స్ కావడం ట్రేడ్ ని విస్మయపరుస్తోంది. వీకెండ్ అయ్యేలోగా సెంచరీ దాటేసి కొత్త బెంచ్ మార్క్ సృష్టించడం ఖాయమనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. సెన్సార్ సమస్య వల్ల వారం ఆలస్యంగా కేరళ స్టోరీ తెలుగు అనువాదం రేపు 13న రాబోతోంది.
నార్త్ తో పాటు ఇటు దక్షిణాదిలోనూ చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడం కేరళ స్టోరీకి కలిసి వస్తోంది. ఒకవేళ తమిళనాడు కేరళ పశ్చిమ బెంగాల్ లో నిషేధం లేకపోతే స్టార్ హీరోలే రికార్డులే లేచిపోయేవని వినిపిస్తున్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ది కాశ్మీర్ ఫైల్స్ సమయంలో ఏర్పడిన వాతావరణమే ఇప్పుడూ కనిపిస్తోంది. ఏపీ తెలంగాణలో విడుదల కాబోతున్న డబ్బింగ్ వెర్షన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందన్నది చూడాలి. కస్టడీ టాక్ పాజిటివ్ గా లేదు. కాబట్టి ఇది కొంత సానుకూలంగా మారొచ్చు. హిందీ ఛత్రపతికి డిజాస్టర్ రివ్యూస్ వచ్చాయి కనక ఏ రాష్ట్రంలో అయినా నో డ్యామేజ్.
సో నార్త్ లోలాగే ఇక్కడా కలెక్షన్లు రాబడితే కేరళ స్టోరీ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. బాలీవుడ్ విశ్లేషకులు మాత్రం ఫైనల్ రన్ అయ్యేలోపే ఎంతలేదన్నా 150 నుంచి 200 కోట్ల మధ్యలో నిలుస్తుందని అదే జరిగితే అక్షయ్ కుమార్ లాంటి హీరోలకు చెంపపెట్టు సమాధానం అవుతుందని అంచనా వేస్తున్నారు. కంటెంట్ ఉంటే తప్ప కనీస ఆదరణ దక్కని ప్రస్తుత ట్రెండ్ లో స్టార్స్ ఉన్నారా లేదాని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. జస్ట్ బాగుందనే మాట వినిపిస్తే చాలు టికెట్లు కొనేస్తున్నారు. అసలు స్టార్ అట్రాక్షనే లేని కేరళ స్టోరీ కన్నా అత్యుత్తమ ఉదాహరణ ఇంకేముంటుంది
This post was last modified on May 12, 2023 9:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…