అమెరికాలోని ఎన్నారైలు, తెలుగు ప్రజలు అమితంగా ఇష్టపడే భారతీయ రెస్టారెంట్ చైన్ “గోదావరి” బోస్టన్‌లో ప్రారంభమైన ‘‘గోదావరి’’ రెస్టారెంట్ చైన్…భారతదేశంలో గోదావరి నదీ ప్రవాహం మాదిరిగానే అమెరికాలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.
ఈ క్రమంలోనే తాజాగా మే 13వ తేదీ, శనివారంనాడు కొలరాడోలోని డెన్వర్‌లో తమ కొత్త లొకేషన్‌ను ‘‘గోదావరి’’ ప్రారంభించబోతోంది. డెన్వర్ లోని ఎన్నారైలకు, భారతీయులకు, భారతీయ వంటకాలను ఇష్టపడే అమెరికన్లకు పసందైన భారతీయ వంటకాలను ఆప్యాయంగా వండివార్చేందుకు ‘‘గోదావరి’’ సిద్ధమైంది (South Indian food).
సెంటెనియల్ యొక్క ప్రధాన శివారు ప్రాంతంలో ‘‘గోదావరి’’ ని ప్రారంభించబోతున్నమని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. అనేక కార్పొరేట్ మరియు రెసిడెన్షియల్ యూనిట్లకు సమీపంలో ‘‘గోదావరి’’ని లాంచ్ చేయబోతున్నాం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భారతీయ వంటకాలను అందించే రెస్టారెంట్లు తక్కువగా ఉన్నాయి. 5500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతీయ సౌందర్యం ప్రతిబింబించేలా ‘‘గోదావరి’’ రెస్టారెంట్ ను తీర్చిదిద్దాం. ‘‘గోదావరి’’ రాకతో డెన్వర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ మదర్స్ డే ఎంతో ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది (Indian restaurant in Denver).
ఇటీవల న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో ప్రారంభించిన ‘‘గోదావరి’’ కి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఆ ప్రాంతంలో రుచికరమైన దక్షిణ భారతదేశ వంటకాలను అందిస్తున్న‘‘గోదావరి’’ని ప్రజలందరూ అమితంగా ఇష్టపడుతున్నారు.
“గోదావరి రెస్టారెంట్ చైన్ ను మరింత విస్తరించేందుకు, మరింత మెరుగైన సేవలు అందించేందుకు కోవిడ్ మాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఆ సమయంలో గోదావరిని మరింత తీర్చిదిద్దేందుకు చేసిన సమాలోచనలు నేడు కార్యరూపం దాల్చాయి. మరిన్ని దక్షిణ భారత వంటకాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని వెంచర్లను చేయడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకున్నాం. భారతదేశంలో మేము ప్రారంభించిన “యునైటెడ్ తెలుగు కిచెన్‌లు (UTK) & ఇష్టా”లకు తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ లభిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ప్రాంతాలలో UTK, ఇష్టా రెస్టారెంట్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ‘‘గోదావరి’’ వ్యవస్థాపకులు కౌశిక్ కోగంటి & తేజ చేకూరి వెల్లడించారు.
“డెన్వర్ ప్రాంతంలోని భారతీయులంతా గోదావరి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ప్రత్యేకించి వారి లంచ్ బఫెట్ మరియు గొప్ప వైబ్‌లను ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఈ ప్రాంతంలో మంచి ఇండియన్ రెస్టారెంట్ (good Indian restaurant) కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాం. ఈ కొరతను గోదావరి తీర్చబోతోంది’’ అని కొలరాడోలో చాలాకాలంగా నివాసముంటున్న అవినాష్ రెడ్డి అన్నారు.
“డెన్వర్ లో ఒక మంచి ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ గోదావరి రెస్టారెంట్ ను ప్రారంభించబోతున్నాం. ఇక్కడి భారతీయులకు, ప్రత్యేకించి దక్షిణాది ప్రజలకు తమ అమ్మమ్మ చేతివంట, ఇంటి భోజనం గుర్తు చేసేలా రుచికరమైన వంటకాలను అందించబోతున్నాం” అని గోదావరి స్థానిక ఫ్రాంచైజీ యజమానులు మణి & రామ్ మళ్ళా చెప్పారు.
ఇక్కడ రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ప్రారంభ తేదీ ఏది? అని తెలుసుకునేందుకు డెన్వర్ పరిసర ప్రాంతాలలో నివసించే ఎన్నారైలు మెసేజులు, ఫోన్లు చేస్తున్నారు. ముఖ్యంగా మిలీనియల్స్‌లో గోదావరికి ఉన్న క్రేజ్ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. రుచికరమైన భారతీయ వంటకాలను ఇష్టపడే భారతీయ భోజన ప్రియులను సంతృప్తిపరిచేందుకు, వారికి పసందైన భోజనం అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాం.
ప్రపంచవ్యాప్తంగా ‘‘గోదావరి’’ ఘుమఘుమలను విస్తరించేందుకు, ‘‘గోదావరి’’ కుటుంబంలో భాగస్వాములయ్యేందుకు, ‘‘గోదావరి’’ ఫ్రాంచైజీ కోసం గోదావరి కార్పొరేట్ (franchise@godavarius.com) ని సంప్రదించేందుకు సంకోచించకండి.
కొలరాడోలోని ‘‘గోదావరి’’ అడ్రస్ ఇదే:
గోదావరి డెన్వర్
6882 S యోస్మైట్ స్ట్రీట్
సెంటెనియల్, కొలరాడో 80112.
Godavari Denver
6882 S Yosemite Street
Centennial, CO 80112.
మరిన్ని వివరాలకు సంప్రదించండి:
ఫోన్: 303-568-9625
denver@godavarius.com
మీరందరూ‘‘గోదావరి’’కి విచ్చేసి మా వంటకాలను, ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం…ధన్యవాదాలు!
Visit: www.GodavariUS.com
మీకోసం మా ‘గోదావరి’ లో కష్టపడి చేసే నోరూరించే వంటకాలను మీరంతా ‘ఇష్ట’ పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము…మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on May 12, 2023 8:03 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…