Movie News

శాకుంతలం.. సౌండ్ లేకుండా

బ్లాక్ బస్టర్ అయిన సినిమాలే కాదు.. డిజాస్టర్ అయిన సినిమాలు కూడా రిలీజ్ టైంలో సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతుంటాయి. ట్రోలింగ్ ద్వారా వాటిని బాగా వార్తల్లో నిలబెడుతుంటారు నెటిజన్లు. థియేటర్లలో వాషౌట్ అయిపోయిన అలాంట ిచిత్రాలు ఓటీటీల్లోకి వచ్చేటపుడు కొంచెం హంగామా కనిపిస్తుంది.

థియేటర్లలో డిజాస్టర్ రిజల్ట్ వస్తే వచ్చిందని.. డిజిటల్ రిలీజ్ టైంలో ఓటీటీలు కూడా వాటిని ప్రమోట్ చేసి జనాల దృష్టిని ఆకర్షించాలని చూస్తాయి. కానీ ‘శాకుంతలం’ సినిమా విషయంలో ఇలా ఏమీ జరగలేదు. ఈ సినిమా రిలీజైనపుడు సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. అందులో గ్రాఫిక్స్ సహా అనేక విషయాలపై నెటిజన్లు టీంను ఒక ఆటాడుకున్నారు. ఇప్పుడా సినిమా చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది.

సరిగ్గా రిలీజైన నాలుగు వారాలకు ‘శాకుంతలం’ను అమేజాన్ ప్రైమ్ వాళ్లు రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచే ఈ సినిమా స్ట్రీమ్ అవుతో్ంది. మామూలుగా ప్రైమ్ వాళ్లు కొత్త సినిమాలు రిలీజవుతున్నపుడు కొంచెం హడావుడి చేస్తారు. థియేట్రికల్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ.. ఓటీటీ రిలీజ్ గురించి అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తారు.

కానీ ‘శాకుంతలం’ విషయంలో అలా చేయలేదు. నెటిజన్లకు కొంచెం లేటుగా ఈ విషయం తెలుస్తోంది. ఐతే ఈ చిత్రం ఓటీటీలో వస్తే చూడాలని చాలామందే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడిక సినిమా చూసి ఇంకో రౌండ్ ట్రోలింగ్ మొదలుపెట్టడం ఖాయం. బిగ్ స్క్రీన్ మీద త్రీడీలో చూసినపుడే ఈ సినిమా జనాలకు ఎక్కలేదు. ఇక చిన్న తెర మీద 2డీలో చూస్తే ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందో చెప్పాల్సిన పని లేదు. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

2 hours ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

3 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago